విధి కాటేసింది.. స్విగ్గీ డెలివరీ బాయ్‌గా మారిన సాఫ్ట్‌వేర్ కంపెనీ ఓనర్, అయినా సరే..
అతను ఒకప్పుడు సాఫ్ వేర్ కంపెనీ నడిపాడు.. ఇప్పుడు స్వీగ్గీ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. అయితే దానికి అతడేమి సిగ్గుపడటం లేదు.. కంపెనీని తిరిగి గాడిలో పెట్టి సక్సెస్ కావాలని చూస్తున్నాడు. అయితే దానికి డబ్బు కావాలి. అందుకోసమే స్విగ్గీ బాయ్ అవతారం ఎత్తాడు.డబ్బు సంపాదించి మళ్లీ సాఫ్ట్ వేర్ రంగంలో తనను తాను ప్రూవ్ చేసుకోవాలని తపన పడుతున్నాడు. అతనెవరో కాదు.. డెలివరీ బాయ్ పద్మనాభన్. ఇతని స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ కస్టమర్ ఎక్స్ లో చేసిన పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ పోస్ట్ లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన నితిన్ కుమార్ అనే కస్టమర్ స్విగ్గీ యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఆ సమయంలో ఓ డెలివరీ బాయ్ పుడ్ తీసుకుని వచ్చాడు.అయితే అతనితో జరిగిన సంభాషణను కస్టమర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్‌లో, "ఇది నా స్విగ్గీ డెలివరీ భాగస్వామి ఈ రాత్రి నాకు ఇచ్చాడు" అని తెలిపాడు.అది ఏంటంటే అతని రెజ్యూమ్.

దాని ప్రకారం.. పద్మనాబన్ 19 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న పూర్తి స్థాయి డెవలపర్. అతను ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీని నడిపాడు. అయితే అనుకోని పరిస్థితులు అతనిని వెంటాడంతో అతను స్విగ్గీ బాయ్ అవతారం ఎత్తాడు. కస్టమర్ ఉద్యోగం కావాలా అని అతనిని అడిగాడు..?" దానికి అతను "లేదు, నేను నా కెరీర్‌ను తిరిగి గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాను" అని చెప్పినట్లుగా నితిన్ కుమార్ పోస్ట్ చేశారు. పద్మనాబన్‌కు అర్హమైన అవకాశాన్ని ఇవ్వాలని కూడా ఆ పోస్టులో కస్టమర్ అభ్యర్థించాడు. దయచేసి దీన్ని అందరికీ షేర్ చేయాలని కోరారు.
పద్మనాబన్ ఒక కంపెనీ వ్యవస్థాపకుడు. అతను కేవలం జీవనోపాధి కోసం కాదు ఆహారాన్ని డెలివరీ చేసేది. అతను గతంలో నడిపిన వ్యాపారాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి ఇలా పుడ్ డెలివరీ చేస్తున్నాడు.ఈ పోప్టులో నితిన్ కుమార్ ఒక ఫోటోను కూడా పంచుకున్నారు. అందులో, ఒక పేజీ రెజ్యూమ్ ఉంది. ఇది జాగ్రత్తతో డెలివరీ చేయబడింది, కోడ్‌తో నిర్మించబడింది అనే శీర్షికగా పేర్కొనబడింది. ఇది డెలివరీ భాగస్వామి పద్మనాబన్ యొక్క రెజ్యూమ్.
నితిన్ కుమార్ పంచుకున్న పద్మనాబన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, "పద్మనాబన్ 2018లో తన కంపెనీని తమిళనాడులో ప్రారంభించారు. పైగా ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ కలిగిన టెక్నాలజీ ప్రొఫెషనల్. అలాగే సహాయం చేసే గుణం కూడా చాలా ఎక్కువ, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా చక్కగా ఉన్నాయి. వృత్తిలో మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తి.
అదేవిధంగా, రెజ్యూమ్‌లో, "నా ప్రత్యేక ఆసక్తి రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) రంగంలో ఉంది" అని కూడా పేర్కొన్నారు. దీనిపై నేను వివిధ అధ్యయనాలు చేస్తున్నాను. దీనిని తదుపరి తరానికి తీసుకెళ్లడం, వారు దానిలో ఎదగడానికి సహాయపడటం, కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలను సృష్టించడం నాకు చాలా ఆసక్తి అని చెప్పుకొచ్చారు. అలాగే, విద్యార్థులు- పరిశ్రమల మధ్య వంతెన నిర్మించడం, కళాశాలలు, పాఠశాలల్లో సెమినార్లు ఇవ్వడం నాకు చాలా ఆసక్తి అని రెజ్యూమ్‌లో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications