ఈ వారంలో అంతర్జాతీయంగా ఐటీ రంగం ఒక్కసారిగా కుదుపులకు లోనైన సంగతి విదితమే. దిగ్గజ సాఫ్ట్‌వేర్ కంపెనీల షేర్లలో భారీ అమ్మకాలు జరగడంతో..ప్రపంచ మార్కెట్లలో సుమారు ఒక ట్రిలియన్ డాలర్ల మేర మార్కెట్ విలువ క్షణాల వ్యవధిలోనే ఆవిరైపోయింది.దీనికి ప్రధాన కారణం ఆంత్రోపిక్ సంస్థ విడుదల చేసిన ఒక కొత్త AI సాధనం అని చర్చకు వచ్చింది.
క్లాడ్ కోవర్క్ కోసం రూపొందించిన ఓపెన్-సోర్స్ లీగల్ ప్లగిన్ మార్కెట్‌లోకి రావడంతో.. టెక్ రంగంలో అనిశ్చితి పెరిగింది. దీనివల్ల సర్వీస్‌నౌ, సేల్స్‌ఫోర్స్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థల షేర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి.ఈ ప్రభావం భారత మార్కెట్‌లపై కూడా పడింది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో వంటి ప్రముఖ ఐటీ కంపెనీలను కలిగి ఉన్న భారత సాఫ్ట్‌వేర్ ఎగుమతిదారుల సూచిక ఫిబ్రవరి 2న ఒక్కరోజులోనే దాదాపు 6 శాతం పడిపోయింది. ఇది గత ఆరు సంవత్సరాలలోనే అత్యంత చెత్త ప్రదర్శనగా నమోదైంది. AI టెక్నాలజీపై ఉన్న భారీ అంచనాల మధ్య.. ఈ స్థాయిలో నష్టాలు రావడం పెట్టుబడిదారుల్లో ఆందోళనను మరింతగా పెంచింది.

రాయిటర్స్ కథనం ప్రకారం.. కాకావో, నావర్, కారాట్ మార్కెట్ వంటి దక్షిణ కొరియాలోని అగ్ర టెAI రంగంలో వేగంగా అభివృద్ధి జరుగుతున్నప్పటికీ, అదే సమయంలో ప్రమాదాలపై హెచ్చరికలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఓపెన్-సోర్స్ AI ఏజెంట్ల విషయంలో ప్రభుత్వాలు, పెద్ద కార్పొరేట్ సంస్థలు జాగ్రత్తగా వ్యవహరించడం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలోనే ప్రసిద్ధ AI ఏజెంట్ OpenClaw పై చైనా, దక్షిణ కొరియా దేశాలు అప్రమత్తమయ్యాయి. క్ కంపెనీలు తమ కార్పొరేట్ నెట్‌వర్క్‌లలో ఓపెన్‌క్లా వినియోగాన్ని పరిమితం చేస్తున్నాయి.
ఈ సంస్థలు తమ ఉద్యోగులకు, డెవలపర్‌లతో సహా ఓపెన్‌క్లాను ఉపయోగించవద్దని స్పష్టమైన సూచనలు జారీ చేశాయి. కంపెనీ డేటా భద్రతకు ఇది ముప్పుగా మారే అవకాశాలు ఉన్నాయని వారు భావిస్తున్నారు. కాకావో సంస్థ అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ.. సంస్థ సమాచార ఆస్తులను కాపాడేందుకు కార్పొరేట్ నెట్‌వర్క్‌లలో ఓపెన్‌క్లా వినియోగాన్ని పరిమితం చేసినట్లు వెల్లడించింది. నావర్ సంస్థ పూర్తిగా నిషేధం విధించగా.. కారాట్ ఓపెన్‌క్లాతో పాటు మోల్ట్‌బాట్ వంటి ఇతర AI ఏజెంట్లను కూడా బ్లాక్ చేసింది.
దక్షిణ కొరియాతో పాటు చైనా కూడా ఇదే దిశగా అడుగులు వేసింది. ఓపెన్‌క్లా వినియోగంలో తగిన భద్రతా సెట్టింగ్‌లు లేకపోవడం వల్ల ప్రమాదాలు తలెత్తుతున్నాయని చైనా పరిశ్రమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. పూర్తి నిషేధం విధించకపోయినా.. ఈ AI ఏజెంట్‌ను ఉపయోగించే సంస్థలు తమ నెట్‌వర్క్ భద్రతను కఠినంగా సమీక్షించాలని, బలమైన ప్రామాణీకరణ విధానాలు, యాక్సెస్ నియంత్రణ వ్యవస్థలు అమలు చేయాలని సూచించింది.
అసలు ఓపెన్‌క్లా అంటే ఏమిటి అనే ప్రశ్న ఇప్పుడు కీలకంగా మారింది. నిజంగా పనులు చేసే AI గా ప్రచారం పొందిన ఓపెన్‌క్లా.. వినియోగదారుల ఆపరేటింగ్ సిస్టమ్‌లు, అప్లికేషన్‌లపై నేరుగా పనిచేస్తుంది. ఇది ఒక స్వీయ-హోస్ట్ చేయబడిన ఓపెన్-సోర్స్ AI ఏజెంట్. పెద్ద భాషా నమూనాలు (LLMs) ఆలోచించే మెదడులా పనిచేస్తే.. ఓపెన్‌క్లా వాటికి చేతుల్లా వ్యవహరిస్తూ వాస్తవ ప్రపంచ చర్యలను అమలు చేస్తుందని అభివర్ణిస్తున్నారు. వెబ్ బ్రౌజింగ్ చేయడం, ఫైళ్లను మార్చడం, సిస్టమ్ కమాండ్లు నడపడం, ఆన్‌లైన్ సేవలతో నేరుగా పరస్పరం జరపడం వంటి పనులు అన్నీ ఇది చేయగలదు.
ఈ సామర్థ్యాలే ఇప్పుడు ఆందోళనలకు కారణమవుతున్నాయి. భద్రతా సంస్థల ప్రకారం.. కొన్ని ఎక్స్‌టెన్షన్‌ల ద్వారా ఇన్ఫోస్టీలర్ మాల్వేర్‌లు పనిచేస్తున్నట్లు గుర్తించారు. పాలో ఆల్టో నెట్‌వర్క్స్ వంటి సైబర్ సెక్యూరిటీ సంస్థలు, ఓపెన్‌క్లా ప్రైవేట్ డేటాను యాక్సెస్ చేయడం, నమ్మదగని కంటెంట్‌కు గురికావడం, బాహ్య కమ్యూనికేషన్‌లు నిర్వహించడం వంటి అంశాలు కలిసివస్తే అది తీవ్రమైన ప్రమాదంగా మారుతుందని హెచ్చరిస్తున్నాయి.
ఏదేమైనా AI రంగంలో వచ్చిన ఈ తాజా పరిణామాలు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాయి. కృత్రిమ మేధస్సు భవిష్యత్ టెక్నాలజీకి మూలస్తంభంగా మారుతున్నప్పటికీ, నియంత్రణలు, భద్రతా ప్రమాణాలు లేకపోతే అదే టెక్నాలజీ మార్కెట్లను కుదిపేసే శక్తిగా మారుతుందనే హెచ్చరికగా ఈ పరిణామాలను చూడవచ్చు.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications