IT News: దేశంలోని అన్ని ప్రధాన కంపెనీలు తమ ఉద్యోగులకు కరోనా కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించిన తర్వాత హైబ్రిడ్ వర్క్ విధానాన్ని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అయితే పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత ప్రధాన ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను పూర్తి స్థాయిలో ఆఫీసులకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పేశాయి. ఉత్పాదకత మెరుగుపరిచేందుకు, టీమ్ వర్క్ స్పిరిట్ పెంచటం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి.
అయితే ప్రస్తుతం టాప్-5 ఐటీ సేవల కంపెనీల్లో ఒకటిగా ఉన్న విప్రో మాత్రం వీటికి విరుద్ధంగా తన ఉద్యోగులకు కొత్త హైబ్రిడ్ వర్క్ పాలసీని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను విప్రో చీఫ్ హెచ్‌ఆర్ సౌరభ్ గోవిల్ పంచుకున్నారు. కొత్తగా తెస్తున్న పాలసీ ప్రకారం ఇకపై ఉద్యోగులు వారానికి మూడు రోజుల పాటు వారికి కేటాయించిన కార్యాలయం నుంచి పనిచేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇదే క్రమంలో ఏడాదిలో నిర్దిష్ట రోజులు మాత్రమే రిమోట్ వర్కింగ్ చేసే అవకాశం ఉంటుందని ఆయన వెల్లడించారు. వాస్తవానికి గతంలోనే టెక్ దిగ్గజం తప్పనిసరి కొత్త హైబ్రిడ్ వర్క్ పాలసీని తీసుకురానున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం కొత్త హైబ్రిడ్ వర్క్ విధానానికి సంబంధించిన వివరాలను కంపెనీ హెచ్ఆర్ అధికారికంగా వెల్లడించారు. భవిష్యత్తును ఉద్ధేశించి రూపొందించిన ఈ ఆధునిక పని విధానం బెస్ట్ ఇన్ క్లాస్ అని గోవిల్ అన్నారు. ఇది ఉద్యోగుల శ్రేయస్సుపై కూడా ఎక్కువగ దృష్టితో నిర్మించబడిందని అన్నారు. అర్థవంతమైన కొలాబరేషన్ వల్ల ప్రతి ఉద్యోగి ఇన్నోవేషన్, సక్సెస్ దిశగా నడిచేందుకు పాలసీ రూపొందించబడిందన్నారు. తాజా పాలసీ తమ ఉద్యోగులకు వృత్తిపరిమైన, వ్యక్తిగత జీవితాన్ని సమపాళ్లలో బ్యాలెన్స్ చేసుకుంటూ వృత్తిలో ముందుకు సాగేందుకు దోహదపడుతుందని అన్నారు.
జీవితంలో కొన్ని సార్లు ప్రత్యేక అవసరాలు ఏర్పడుతుంటాయి. అలాంటి సందర్భంలో తమ ఉద్యోగులకు కొత్త పాలసీ వెన్నుముకల నిలుస్తుందని వాటిని విజయవంతంగా పాసాన్ అయ్యేందుకు అవకాశం కల్పిస్తుందని గోవిల్ పేర్కొన్నారు. ఇదే క్రమంలో తమ ఉద్యోగులు అత్యుత్తమ పనితీరును కనబరిచేందుకు, వారి పనికి వారే జవాబుదారీతనాన్ని తీసుకునేందుకు వీలుకల్పిస్తుందని అన్నారు. అలాగే ఉద్యోగులు తమకు అనుకూలంగా వారంలో ఎప్పుడు ఆఫీసులకు రావాలో నిర్ణయించుకునేందుకు సైతం వెసులుబాటు కల్పించబడిందని చెప్పారు.
కొత్త హైబ్రిడ్ పాలసీ విధానంలో ఉద్యోగులకు ఒక సంవత్సరంలో పేర్కొన్న రోజుల పాటు రిమోట్‌గా పని చేయడానికి, స్వీయ సంరక్షణ కోసం లేదా వారు ప్రియమైన వారిని ఆరోగ్యాన్ని సంరక్షించటానికి వీలు కల్పిస్తుందని విప్రో వెల్లడించింది. ప్రయోజనంతో లాభంపై దృష్టి సారించే సంస్థగా ఉద్యోగుల శ్రేయస్సుకు ప్రాధాన్యతనిస్తూ వారి అత్యుత్తమ పనిని చేయడానికి సహచరులకు అధికారం ఇచ్చే పని సంస్కృతిపై దృష్టి పెడుతున్నట్లు టెక్ దిగ్గజం పేర్కొంది.


Click it and Unblock the Notifications