Wipro News: దేశంలో టాప్-5 టెక్ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతున్న విప్రో నిన్న తన సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను వెలువరించింది. అయితే ఇవి ఇన్వెస్టర్లను, మార్కెట్లను పూర్తిగా నిరాశకు గురిచేశాయి.
ప్రస్తుత వ్యాపార పరిస్థితుల్లో టెక్ దిగ్గజం తన ఖర్చులను తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలో యాజమాన్యం 5 అనుబంధ సంస్థలను మాతృ సంస్థ విప్రో లిమిటెడ్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దిగ్గజ సంస్థలు, టెక్ కంపెనీలు కూడా తమ ఖర్చులను తగ్గించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుతం దేశీయ దిగ్గజం కూడా విదేశీ సంస్థల దారిలోకే చేరుకుందని తాజా చర్యలు చెబుతున్నాయి.

థియరీ డెలాపోర్టే విప్రో సీఈవోగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అటు ఉద్యోగుల నుంచి ఇటు మేనేజ్‌మెంట్‌లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. మే నెలలో విప్రో సాధారణ ఐటీ సేవల విభాగం కింద ప్రభుత్వ సేవల కోసం విడిగా నడుస్తున్న ఇండియన్ స్టేట్ రన్ ఎంటర్‌ప్రైజెస్(ISRE) విభాగాన్ని విలీనం చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ISRE డిపార్ట్‌మెంట్ దాదాపు 20.18 శాతం ఆదాయ నష్టాన్ని ఎదుర్కోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సాధారణ ఐటీ సేవల విభాగం కింద విలీనం చేశారు.
తాజాగా విప్రో హెచ్‌ఆర్ సర్వీసెస్, విప్రో ఓవర్సీస్ ఐటీ సర్వీసెస్, విప్రో టెక్నాలజీ ప్రొటెక్ సర్వీసెస్, విప్రో ట్రేడ్‌మార్క్స్ హోల్డింగ్, విప్రో విఎల్‌ఎస్‌ఐ డిజైన్ సర్వీసెస్‌లను మాతృసంస్థ విప్రో లిమిటెడ్‌లో కలిపేయాలని నిర్ణయించినట్లు ఫలితాల విడుదల సమయంలో వెల్లడించారు. మేనేజ్‌మెంట్ బోర్డు సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే దీనికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నుంచి చట్టపరమైన అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఇవన్నీ వచ్చిన తర్వాతే ఇంటిగ్రేషన్ పనులు ప్రారంభమవుతాయని సమాచారం.
అసలు ఈ నిర్ణయం వెనుక కారణాలను పరిశీలిస్తే.. వ్యాపార కార్యకలాపాలను ఏకీకృతం చేయడం, కార్యకలాపాల ఏకీకరణను ప్రారంభించడం, వివిధ సిబ్బంది ఖర్చులను తగ్గించడం వంటివి ఉన్నాయి. కంపెనీ వీలీనం చేయాలనుకుంటున్న అనుబంధ కంపెనీల్లో విప్రోకు 100 శాతం వాటా కలిగి ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications