Thierry Delaporte: దేశంలోని టెక్ దిగ్గజాల్లో ఒకటిగా కొనసాగుతున్న విప్రోకు వరుస కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. అసలే వ్యాపార పరిస్థితులు అస్థిరంగా కొనసాగుతున్న వేళ కొత్త కష్టాలు చుట్టుముడుతూ ఊపిరాడకుండా చేస్తున్నాయి.
తాజాగా విప్రో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO) థియరీ డెలాపోర్టే రాజీనామా చేసినట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ప్రకటించింది. దీంతో టెక్ దిగ్గజం విప్రో ఆయన స్థానంలో శ్రీనివాస్ పల్లియాను కొత్త సీఈవో అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. థియరీ డెలాపోర్టే రాజీనామా ఏప్రిల్ 6, 2024 నుంచి అమలులోకి వచ్చే విధంగా బోర్డు నిర్ణయం తీసుకుంది. అతను మే 31, 2024న పని వేళలు ముగిసే సమయానికి కంపెనీ ఉద్యోగం నుండి విముక్తి పొందుతారని కంపెనీ వెల్లడించింది.

కంపెనీ అమెరికాస్ 1 ఏరియాకు CEO అయిన శ్రీనివాస్ పల్లియా ఏప్రిల్ 7 నుంచి కొత్త సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. డెలాపోర్టే 56ను విప్రో జూలై 2020లో సీఈవో అండ్ ఎండీగా నియమించిన సంగతి తెలిసిందే. దీనికి ముందు ఆయన క్యాప్‌జెమినీలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO)గా పనిచేశారు. గత డిసెంబరులో డెలాపోర్టే ఏడాదికి రూ.82 కోట్లకు పైగా జీతం ప్యాకేజీని పొందుతూ దేశంలో అత్యధికంగా వేతనం పొందుతున్న ఐటీ కంపెనీ సీఈవోగా నిలిచారు. ప్రస్తుతం పారిస్ లో నివసిస్తున్న ఆయన ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీల్లో పనిచేసిన అనుభవం కలిగి ఉన్నారు.
మార్చిలో విప్రో ఆరుగురు ఉద్యోగులను సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పాత్రలకు మరియు 25 మందిని వైస్ ప్రెసిడెంట్ పాత్రలకు పదోన్నతి కల్పించింది. అయినప్పటికీ గత ఏడాది నుంచి కంపెనీలో ఉన్నత స్థాయి ఉద్యోగుల నిష్క్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి. వివరాల్లోకి వెళిత.. ఫైనాన్స్ చీఫ్ జతిన్ దలాల్, చీఫ్ గ్రోత్ ఆఫీసర్ స్టెఫానీ ట్రౌట్‌మన్, డిజిటల్ అండ్ క్లౌడ్ హెడ్ బరత్ నారాయణన్‌తో సహా చాలా మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు గత సంవత్సరంలో విప్రోను వీడారు. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థ తక్కువ మంది సీనియర్ ఉద్యోగులను ప్రమోట్ చేసింది.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications