Wipro News: రెండు శుభవార్తలు చెప్పిన విప్రో.. సంతోషంతో గాల్లో తేలుతున్న టెక్కీలు..!!
Wipro Salary Hikes: దేశీయ టాప్-5 ఐటీ సేవల కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతున్న విప్రో ఈ ఏడాది తన ఉద్యోగులకు వరుసగా శుభవార్తలు చెబుతూనే ఉంది. తాజాగా క్యూ2 ఫలితాలను ప్రకటించిన విప్రో మరో మంచి వార్తను చెప్పింది. దీంతో కంపెనీలో పనిచేస్తున్న టెక్కీలు సంతోషంలో పండుగ చేసుకుంటున్నారు.
తాజాగా విప్రో తన ఉద్యోగులకు వేతన పెంపులను ప్రకటించింది. సెప్టెంబర్ 1, 2024 నుంచి పెంచిన హైక్స్ చెల్లించబడతాయని చీఫ్ పీపుల్స్ ఆఫీసర్ శ్రీనివాస్ పిళ్లై మీడియాకు వెల్లడించారు. తాజాగా రెండవ త్రైమాసిక ఫలితాలను వెల్లడిస్తున్న క్రమంలోనే కంపెనీ ఉద్యోగుల వేతన పెంపుల గురించి ఈ ప్రకటన చేసింది. హైక్స్ తర్వాత కూడా టెక్ దిగ్గజం తన ఆదాయాల మార్జిన్ పెంపుకోగలిగినట్లు వెల్లడైంది. ప్రస్తుత వ్యాపార వాతావరణంలో టీసీఎస్ ఇప్పటికే శాలరీ పెంపు కొనసాగిస్తుండగా, హెచ్‌సీఎల్ టెక్ కనీసం 7 శాతం నుంచి అత్యుత్తమ పనితీరు కనబరిచిన వ్యక్తులకు 12-15 శాతం హైక్ అందిస్తున్నట్లు పేర్కొంది. ఇదే క్రమంలో ఇన్ఫోసిస్ మాత్రం ఆర్థిక సంవత్సరం రెండవ అర్థ భాగానికి వేతన పెంపును పోస్ట్‌పోన్ చేసినట్లు వెల్లడించింది.

విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అపర్ణ అయ్యర్ 2023లో ఒక ప్రత్యేకమైన బిజినెస్ సైకిల్ శాలరీ ఇంక్రిమెంట్‌లలో జాప్యానికి కారణమైందని, అయితే సెప్టెంబర్ రోల్‌అవుట్ ముందుకు సాగడానికి సాధారణ హైక్ సైకిల్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఫ్రెషర్ల హైరింగ్ గురించి చెబుతూ కంపెనీ క్యూ1 నుంచి స్థిరంగా త్రైమాసికానికి 2500-3000 మధ్య ఉద్యోగులను ఆన్ బోర్డ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే క్రమంలో విప్రో 2025 ఆర్థిక సంవత్సరానికి క్యాంపస్‌లో, బయట సహా 10,000-12,000 మందిని నియమించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ వెల్లడించారు. అలాగే ఫ్రెషర్ బ్యాక్‌లాగ్ గురించి అడిగినప్పుడు, క్యూ3 చివరి నాటికి అది క్లియర్ అవుతుందని హామీ ఇచ్చారు.
హైబ్రిడ్ వర్క్ విధానం అమలు..
విప్రో తన ఉద్యోగులకు కొత్త హైబ్రిడ్ వర్క్ పాలసీని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను విప్రో చీఫ్ హెచ్‌ఆర్ సౌరభ్ గోవిల్ పంచుకున్నారు. కొత్తగా తెస్తున్న పాలసీ ప్రకారం ఇకపై ఉద్యోగులు వారానికి మూడు రోజుల పాటు వారికి కేటాయించిన కార్యాలయం నుంచి పనిచేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇదే క్రమంలో ఏడాదిలో నిర్దిష్ట రోజులు మాత్రమే రిమోట్ వర్కింగ్ చేసే అవకాశం ఉంటుందని ఆయన వెల్లడించారు. వాస్తవానికి గతంలోనే టెక్ దిగ్గజం తప్పనిసరి కొత్త హైబ్రిడ్ వర్క్ పాలసీని తీసుకురానున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొత్త హైబ్రిడ్ వర్క్ విధానానికి సంబంధించిన వివరాలను కంపెనీ హెచ్ఆర్ అధికారికంగా వెల్లడించారు.


Click it and Unblock the Notifications