IT News: దేశంలోని అతిపెద్ద టెక్ దిగ్గజంగా టీసీఎస్ కొనసాగుతోంది. అయితే కొత్త ఏడాది కంపెనీ ఉద్యోగులకు జీతాల చెల్లింపు నిలిపివేయటం సంచలనంగా మారింది. దీంతో టెక్కీలు ఒక్కసారిగా షాక్‌కి గురవుతున్నారు.
సాధారణంగా ఇల్లు నడవాలన్నా రోజువారీ అవసరాలకోసమైనా ఉద్యోగులు మెుదటి తారీఖున పడే జీతం కోసం వేచి ఉంటారు. దీనికి తోడు చాలా మంది టెక్కీలకు హోమ్ లోన్, పర్సనల్ లోన్ అంటూ వివిధ చెల్లింపులు కూడా ఉంటుంటాయి. అయితే ఈ సారి టెక్ దిగ్గజం టీసీఎస్ ఇచ్చిన షాక్ కొత్త ఏడాది వారి మైండ్ పోగొడుతోంది. ఇటీవల కంపెనీ మూడు పెద్ద డీల్స్ కోల్పోయింది. దీంతో కంపెనీ ఆదాయాలు సైతం భారీగానే దెబ్బతిన్నాయి.

ఈ క్రమంలో ఉద్యోగుల పనితీరును మెరుగుపరచడానికి, క్లిష్టమైన ప్రాజెక్ట్‌ను సజావుగా అమలు చేయడానికి దాదాపు 2000 మంది ఉద్యోగులను ట్రాన్స్‌ఫర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కంపెనీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేటాయించిన ప్రదేశానికి వెళ్లేందుకు నిరాకరించిన దాదాపు 900 మంది టెక్కీలకు టీసీఎస్ జీతాల చెల్లింపును నిలిపివేయటం సంచలనంగా మారింది. గతంలో కంపెనీ అకస్మాత్తుగా 2000 మందిని బదిలీ చేయటాన్ని NITES తప్పుపట్టిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు బదిలీని వ్యతిరేకించిన 900 మంది ఉద్యోగుల జీతాలు నిలిపివేయబడ్డాయి.
నవంబర్ 2023లో కంపెనీ వ్యాపార అవసరాలకు అనుగుణంగా కొందరు ఉద్యోగులను రెండు వారాల్లో కేటాయించిన ఆఫీసుల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ సుమారు 300 మంది ఉద్యోగుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు NITES కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖకు లేఖ పంపటం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కంపెనీ నిబంధనలు పాటించనందున కొత్త కార్యాలయాలకు రిపోర్ట్ చేయని ఉద్యోగులపై కంపెనీ ప్రస్తుతం కన్నెర్ర చేసింది.
ఇదే విషయాన్ని ఉద్యోగులకు కంపెనీ మేనేజ్మెంట్ మెయిల్ ద్వారా వెల్లడించగా.. టెక్కీలను నిర్దిష్ట పోర్టల్‌లను ఉపయోగించకుండా నిరోధించినట్లు వెల్లడైంది. మెుత్తానికి మాట వినని టెక్కీలకు బుద్ధి చెప్పాలని భావించిన టీసీఎస్ కఠినంగా వ్యవహరిస్తూ వారి వేతనాలను నిలిపివేయటం చాలా మందిని భయాలకు గురిచేస్తోంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications