TCS News: టీసీఎస్ చేతికి ఆస్ట్రేలియా స్టాక్ మార్కెట్.. మ్యాటర్ ఏంటంటే..??
TCS News: అనిశ్చిత వ్యాపార వాతావరణంలో దేశీయ టెక్ కంపెనీలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో దిగ్గజం టీసీఎస్ ఆస్ట్రేలియా నుంచి మంచి డీల్ కొట్టేసింది.
ఆస్ట్రేలియన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆపరేటర్ ASX.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)కు తన క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ సాఫ్ట్‌వేర్‌ని తిరిగి నిర్మించటానికి నియమించుకున్నట్లు వెల్లడించింది. అనేక విమర్శలు ఎదుర్కొన్న తర్వాత.. బ్లాక్‌చెయిన్ ఆధారిత ప్రయత్నాన్ని విరమించుకుని తాజా చర్యకు ఉపక్రమించింది. 2017లో ఆస్ట్రేలియన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ తీసుకున్న నిర్ణయం నుంచి తాజాగా నిష్క్రమించింది.

ASX దాని వినియోగదారులు ప్రమాదకరమని భావించే "బిగ్ బ్యాంగ్" మార్పు కాకుండా దశలవారీగా కొత్త సాఫ్ట్‌వేర్‌కి మారుతోంది. అయితే దీనికి సమయం పడుతుంది. ఈ క్రమంలో భారతదేశానికి చెందిన టెక్ దిగ్గజం టీసీఎస్ సాఫ్ట్‌వేర్‌ను ఫిన్‌లాండ్, కెనడాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్స్‌ఛేంజీలు ASX క్లియరింగ్ హౌస్ ఎలక్ట్రానిక్ సబ్‌రిజిస్టర్ సిస్టమ్ లేదా CHESS కోసం నిర్వహించగల ఫంక్షన్‌ల కోసం ఉపయోగిస్తున్నాయని ఆస్ట్రేలియన్ ఎక్స్ఛేంజ్ సోమవారం తెలిపింది.
వాస్తవానికి ఆస్ట్రేలియా స్టాక్ ఎక్స్ఛేంజీ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారంగా నిర్మించిన టెక్నాలజీలో కోడ్ లో చాలా తప్పులు ఉన్నాయని, వాటిని తిరిగి రీరైట్ చేయాలని సమీక్షలో వెల్లడి కావటంతో తన ప్రయత్నాలను రద్దు చేసుకుంది. వైఫల్యం ఫలితంగా A$176.3 మిలియన్ల రైట్‌డౌన్‌కు దారితీసింది. ప్రపంచంలోని 17వ అతిపెద్ద ఎక్స్ఛేంజ్ అయిన ASXపై మార్కెట్ భాగస్వాముల నమ్మకాన్ని ప్రభావితం చేసింది.


Click it and Unblock the Notifications