TCS News: తొక్కిపట్టి నారతీసిన TCS.. 16 మందిని తొలగించిన టెక్ దిగ్గజం..
TCS News: దేశంలో టాటా గ్రూప్ కంపెనీలకు ఉండే నిబద్ధత, నిజాయితీ గురించి మనందరికీ తెలిసిందే. డబ్బు కంటే ముందు మంచి నడవడికకు టాటా కంపెనీలు ఎల్లప్పుడూ మారుపేరుగా దశాబ్ధాల నుంచి తమ వ్యాపార ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాయి.
ఈ క్రమంలోనే దేశంలో అతిపెద్ద టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీలో ఉద్యోగాల పేరుతో జరిగిన కుంభకోణం కొన్ని నెలల కిందట బయటపడ్డ సంగతి తెలిసిందే. దీనిని కంపెనీ చాలా సీరియస్ గా తీసుకుంది. దీనిపై అంతర్గతంగా విచారణ జరిపేందుకు కమిటీని సైతం వేసింది. తాజాగా ఈ కమిటీ కనుగొన్న వాస్తవాలతో కొందరిని టీసీఎస్ ఉద్యోగాల నుంచి తొలగించినట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ వార్త ఐటీ రంగంలో సంచలనంగా మారింది. చాలా మంది బ్యాక్ డోర్ ప్రవేశాల ద్వారా టెక్కీలుగా మారుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటివి నివారించే క్రమంలో టీసీఎస్ తొలి అడుగు వేసినట్లు చెప్పుకోవచ్చు.

వివరాల్లోకి వెళితే.. టీసీఎస్ లో ఉద్యోగాల పేరుతో డబ్బు వసూలు చేసిన వ్యవహారంలో కంపెనీ 16 మంది ఉద్యోగులను తొలగించింది. అలాగే 6 వెండార్ కంపెనీలను(రిక్రూట్మెంట్ సంస్థలు) వారి యజమానులతో పాటు అనుబంధ సంస్థలు టెక్నాలజీ మేజర్ టీసీఎస్ తో ఎలాంటి వ్యాపారం చేయకుండా నిషేధించబడ్డాయి. ఉద్యోగాల కుంభకోణం మెుదటగా జూన్ 2023లో బయటకు వచ్చింది. కంపెనీలో రిక్రూట్‌మెంట్ ప్రక్రియలను పర్యవేక్షిస్తున్న సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు వ్యాపారాన్ని పొందడానికి లంచం ఇవ్వడంలో సిబ్బంది సంస్థలు ప్రమేయం ఉన్నాయనే ఆరోపణలపై పూర్తి దర్యాప్తు చేపట్టింది.
ఈ మెుత్తం దర్యాప్తులో కంపెనీ 19 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. సంస్థలోని ఉన్నత స్థాయి ఉద్యోగులు ఎవరూ ఇందులో లేరని, దీనివల్ల ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని కంపెనీ పేర్కొంది. ఈ విషయం పూర్తి పరిశీలన తర్వాత వివిధ స్థాయిల్లో ఉల్లంఘనలపై చర్యలు చేపట్టామని ఈ విషయం ఇంతటితో ముగిసిందని సీఈవో కృతివాసన్ మీడియాకు వెల్లడించారు.


Click it and Unblock the Notifications