Infosys News: డిసెంబర్ త్రైమాసికం ముగియటంతో ప్రస్తుతం అందరి చూపు ఐటీ కంపెనీల ఆర్థిక ఫలితాల ప్రకటనపైనే ఉంది. వాస్తవానికి డాలర్ బలపడటంతో పడిపోయిన రూపాయి విలువ టెక్ కంపెనీలకు కాసుల వర్షం కురిపించనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే క్రమంలో సంక్రాంతికి ముందు టెక్కీలు సైతం హైక్ గురించి ప్రకటనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దేశంలోని రెండవ అతిపెద్ద టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ తాజాగా తన ఉద్యోగులకు కీలక ప్రకటన చేసింది. కంపెనీ ప్రస్తుతం ఉద్యోగులకు చెల్లించాల్సిన హైక్స్ నాలుగో త్రైమాసికానికి పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీనికి ముందు బెంగళూరుకు చెందిన టెక్ కంపెనీ చివరిగా తన ఉద్యోగుల వేతనాలను నవంబర్ 2023లో రివైజ్ చేసింది. దీంతో టెక్కీలు ఈసారి కూడా సంక్రాంతికి ముందుగానే కంపెనీ వేతన పెంపులను ప్రకటించవచ్చని ఇన్నాళ్లు భావించారు. అయితే ప్రస్తుతం రాబోయే త్రైమాసికానికి వాటిని వాయిదా వేయనున్నట్లు ప్రకటించటంతో నిరాశ చెందుతున్నారు.

వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ప్రభావితమైన డిమాండ్ ఐటీ పరిశ్రమలో ప్రస్తుతం వేతన పెంపుల ఆలస్యానికి కారణంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. బలహీనమైన విచక్షణతో కూడిన వ్యయాలు, ఆలస్యమైన క్లయింట్ బడ్జెట్లతో పాటు కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితి ఐటీ కంపెనీలపై ఒత్తిడిని పెంచుతోంది. ప్రస్తుతం టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ తో పాటు హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎల్‌టిఐ మైండ్ ట్రీ, ఎల్ అండ్ టి టెక్ సర్వీసెస్ కూడా వేతన పెంపులను ప్రస్తుతం పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించాయి.
ఇన్ఫోసిస్ రెండవ త్రైమాసికంలో లాభాలను పరిశీలిసిస్తే త్రైమాసిక ప్రాతిపదికన నికర లాభం 2.2 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఈ సమయంలో మార్కెట్ అంచనాలను అందుకోవటంలో టెక్ దిగ్గజం మిస్ అయ్యింది. ఒక పక్క వేతనాల పెంపు లేనప్పటికీ.. బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రీ-ఎర్నింగ్స్ నోట్‌లో.. డిసెంబర్ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ మార్జిన్‌లు దెబ్బతింటాయని పేర్కొంది. ఈ క్రమంలో ఇన్ఫోసిస్ తన మార్జిన్లను మెరుగుపరుచుకునేందుకు ప్రాజెక్ట్ మ్యాక్సిమస్ పేరుతో తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కంపెనీ ఉత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు హైక్స్ అందిస్తోంది. ముఖ్యంగా ఏఐపై పనిచేసే టీమ్స్ రివార్డులు పొందటానికి ప్రత్యేకంగా బడ్జెట్ కలిగి ఉన్నాయని తెలుస్తోంది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

IT Jobs: కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఆగండి! ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఓసారి చూడండి!

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్‌పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications