Infosys News: ఇటీవల దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ తన రెండవ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఆర్థిక పరమైన ఫలితాలతో పాటు కంపెనీ భవిష్యత్తు చర్యలకు సంబంధించి కీలక విషయాలను ప్రకటించింది.
వీటిలో ఒకటి మాత్రం ఇప్పుడు మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం కంపెనీ క్యాంపస్ హైరింగ్‌కి వెళ్లే ఉద్దేశ్యంలో ప్రస్తుతం లేదని ప్రకటించింది. దీంతో టెక్ ప్రెషర్లు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. వ్యాపారంలో కరోనా తర్వాత వచ్చిన కొంత బూమ్ కారణంగా భారీగా రిక్రూట్మెంట్ చేపట్టింది. అలా గత ఏడాది కంపెనీ దాదాపు 50,000 మది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను నియమించుకుంది.

అయితే కంపెనీ నుంచి ఆఫర్ లెటర్లు పొందిన వీరిలో చాలా మంది కంపెనీ ఎప్పుడు ఆన్ బోర్డ్ చేస్తుందా అని ఎదురుచూస్తున్నారు. దీనిపై కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిలంజన్ రాయ్ స్పందిస్తూ తాము గతంలో విడుదల చేసిన ఆఫర్ లెటర్లను హానర్ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్ట్‌లు వచ్చినప్పుడు కొత్త నియామకాలకు వెళ్లే ఆలోచనలో కంపెనీ ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అంటే కంపెనీలు అవసరమైతేనే కొత్త నియామకాలు చేయాలని అనుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు రావాలని ఇటీవల వెల్లడిస్తున్నాయి. దీని ద్వారా ఉద్యోగుల పనితీరును మెరుగుపరిచి ఉన్న ప్రాజెక్టులను ఉత్తమంగా నిర్వహించాలని చూస్తున్నాయి.
టెక్ కంపెనీల్లో ఒకపక్క అట్రిషన్ రేటు తగ్గటం, ఉన్న ఉద్యోగులకు ఏఐ వంటి కొత్త నైపుణ్యాల్లో శిక్షణను ఇస్తూ కంపెనీలు ముందుకు సాగటం కొత్త నియామకాలను దాదాపు అసాధ్యంగా మార్చేశాయి. జాబ్ మార్కెట్లో ఐటీ సేవల రంగంలోని కంపెనీలు కొత్త ఉద్యోగుల నియామకం కోసం అస్సలు హడావిడి చేయటం చేదు. రిక్రూట్మెంట్ రష్ పూర్తిగా చల్లారిపోయింది. ప్రాజెక్టుల రాక సన్నగిల్లటంతో టెక్ కంపెనీలు కంపెనీ అదనపు ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. దీంతో కాలేజీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకుని జాబ్ మార్కెట్లోకి అడుగుపెడుతున్న ఫ్రెషర్లు ఏం చేయాలో పాలుపోక గందరగోళంలో ఉన్నారు.


Click it and Unblock the Notifications