IBM News: ప్రపంచ వ్యాప్తంగా బఢా టెక్ కంపెనీలు ఉద్యోగులను అస్సలు ఆలోచించుకుండా తీసిపడేస్తున్నాయి. దీనికి తోడు ప్రాజెక్టులు లేకపోవటంతో కంపెనీలు తీవ్ర ఒత్తిడికి లోనవుతూ ఉద్యోగులపై ఆ ప్రభావాన్ని ప్రస్తుతం చూపిస్తున్నాయి.
ఐబీఎమ్ ప్రపంచ వ్యాప్తంగా తన వ్యాపారాన్ని గాడిలో పెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో తన కంపెనీలో మేనేజర్ స్థాయి ఉద్యోగులకు అల్టిమేటమ్ జారీ చేసింది. ఇకపై రిమోట్ వర్కింగ్ పద్ధతిలో ఉన్న మేనేజర్లు ఆఫీసులకు దగ్గరకు మారాలని లేదా కంపెనీకి రిజైన్ చేసి వెళ్లిపోవచ్చని తేల్చి చెప్పటం సంచలనంగా మారింది. ఇకపై రానున్న కాలంలో ఇతర టెక్ కంపెనీలు సైతం ఇదే విధమైన ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని టెక్ రంగంలోని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతానికి ఐబీఎమ్ అమెరికాలోని తన మేనేజర్లకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. వీటి ప్రకారం వెంటనే ఆఫీసులకు రిపోర్టు చేయాలని లేదా క్లైంట్ లొకేషన్ లో వారానికి మూడు రోజులు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. బ్యాడ్జ్-ఇన్ డేటా ఆఫీసులకు వస్తున్న ఉద్యోగుల సంఖ్యను అంచనా వేసేందుకు ఉపయోగించబడుతుందని ఇది మేనేజర్లు, హెచ్ ఆర్ డిపార్ట్మెంట్లతో పంచుకోబడుతుందని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతానికి మిలిటరీ సర్వీస్, మెడికల్ నీడ్స్ ఉన్న ఉద్యోగులకు మాత్రమే కొంత మినహాయింపులను కంపెనీ అందిస్తోంది.
కంపెనీ మెమో ప్రకారం ఉద్యోగులు ఆఫీసులకు 80 కిలోమీటర్ల లోపు లేదా 50 మేళ్ల ప్రయాణ దూరంలో అందుబాటులో ఉండాలని తెలుస్తోంది. వీటిని పాటించటానికి సిద్ధంగాలేని లేదా రీలొకేట్ కావటానికి నిరాకరించే ఉద్యోగులు రిమోట్ వర్క్ పొందటం కుదరదని వారు నిర్మొహమాటంగా కంపెనీని వీడొచ్చని ఐబీఎమ్ వెల్లడించింది.
కంపెనీ తన పనితీరును మెరుగుపరుచుకునేందుకు, ఉత్పాదకతను పెంచుకునేందుకు, వినూత్నమైన ఆలోచనలను పెంపొందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆఫీసులకు రాని ఉద్యోగులకు ప్రమోషన్లు అరుదుగా ఉంటాయని గతంలోనే ఒక ఇంటర్వ్యూలో ఐబీఎమ్ సీఈవో అరవింద్ కృష్ణ చెప్పిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications