HCL Tech News: దేశీయ టాప్ టెక్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న హెచ్‌సీఎల్‌టెక్ తాజాగా తన రెండవ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్రమంలో కంపెనీ తాజాగా ఉద్యోగులకు వేతన పెంపులపై కీలక ప్రకటన చేసింది. గడచిన కొన్నేళ్లుగా ఐటీ రంగంలో అలుముకున్న అనిశ్చితులు ప్రస్తుతం తగ్గటంతో టెర్ పరిశ్రమలోని కంపెనీలు ఉద్యోగులకు శాలరీ హైక్స్ ప్రకటిస్తున్నాయి.
ఈ క్రమంలోనే అక్టోబర్ నుంచి తమ టెక్కీలకు 7 శాతం జీతాల పెంపును అమలు చేయనుంది. ఇదే క్రమంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన టెక్కీలకు మాత్రం శాలరీ హైక్ 12-15 శాతం మధ్య ఉండనుందని తెలుస్తోంది. మూడవ త్రైమాసికంలో తమ ఆపరేటింగ్ మార్జిన్‌లపై వేతనాల పెంపు ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని అంచనా వేసినట్లు కంపెనీ చీఫ్ పీపుల్ ఆఫీసర్ రామచంద్రన్ సుందరరాజన్ తెలిపారు. తాజాగా వేతన పెంపులు అక్టోబర్ నుంచి అమలులోకి వస్తాయని కంపెనీ క్యూ2 ఫలితాల సమయంలో వెల్లడించింది.

పనితీరు ఆధారిత ఇంక్రిమెంట్‌లలో టాప్ పెర్ఫార్మర్లు రెండంకెల పెరుగుదలను అందుకుంటారని సుందరరాజన్ పేర్కొన్నారు. టాప్ పెర్ఫార్మర్ టెక్కీలకు 12-14 శాతం మధ్య హైక్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో దేశీయంగా మూడవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా ఉన్న హెచ్‌సీఎల్ టెక్ ఉద్యోగుల సంఖ్య క్యూ2లో 2,18,621గా ఉంది. ఎంత మంది ఉద్యోగులు హైక్ పొందటానికి అర్హులు అనే సంఖ్యలు కంపెనీ రివ్యూ సైకిల్ పై ఆధారపడి ఉంటాయని సుందరరాజన్ తెలిపారు. ఈ క్రమంలో లేటరల్ ఎంట్రీ ద్వారా వచ్చిన ఉద్యోగులు ఏడాది సర్వీస్ పూర్తి చేసుకుంటేనే హైక్ పొందటానికి అర్హత పొందుతారని ఆయన తెలిపారు.
జీతాల పెంపుదల ఆపరేటింగ్ మార్జిన్‌లను కొద్దిగా మాత్రమే ప్రభావితం చేస్తుందని సుందరరాజన్ అంగీకరించారు. అయితే సమర్థత చర్యల ద్వారా దీనిని భర్తీ చేసేందుకు కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. హైక్స్ గడచిన ఏడాది మాదిరిగానే యాన్యువల్ కంపెన్సేషన్ రివ్యూ ప్రాసెస్ ప్రకారం జరగనున్నట్లు పేర్కొన్నారు. నోయిడా ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న కంపెనీ హెడ్ కౌంట్ రెండవ త్రైమాసికంలో 780 తగ్గుదలను చూసింది. రెండవ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 11 శాతం పెరిగి రూ.4,235 కోట్లకు చేరుకోగా, ఆదాయం వార్షిక ప్రాతిపదికన 8.2 శాతం పెరిగి రూ.28,862 కోట్లుగా నమోదైంది.
ఐటీ సేవలకు డిమాండ్ మందగించిన వాతావరణంలో కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు మూడో త్రైమాసికానికి వేతన పెంపులను వాయిదా వేస్తుండగా.. బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ ప్రధానంగా హైక్ సైకిల్ మార్పు, సాధారణ కాలానుగుణ పెరుగుదల కారణంగా ఆపరేటింగ్ మార్జిన్‌లలో 110 బేసిస్ పాయింట్ సీక్వెన్షియల్ పెరుగుదలను అంచనా వేసింది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications