Cognizant News: హైదరాబాదుకు గుడ్‌బై చెప్పేస్తున్న కాగ్నిజెంట్..! సడన్ డెసిషన్..
ఐటీ నగరంగా దేశంలో వేగంగా గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాదు కళ క్రమంగా తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. వరుసగా ఒకదాని తర్వాత మరొక టెక్ కంపెనీ తీసుకుంటున్న నిర్ణయాలు ఇదే సూచిస్తున్నాయి.
సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సైతం విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్ దారిలో ముందుకు సాగాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే కంపెనీ తనకు హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఉన్న కార్యాలయ ఆస్తులను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నాన్-కోర్ రియల్ ఎస్టేట్‌పై పెట్టుబడి పెట్టే ప్రణాళికలో భాగంగా ఉంది. ఈ క్రమంలో కంపెనీ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని 10 ఎకరాల క్యాంపస్‌తో పాటు చెన్నైలోని సిరుసేరిలోని 14 ఎకరాల క్యాంపస్‌ను విక్రయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

రెండేళ్లలో 400 మిలియన్ డాలర్లను ఆదా చేసేందుకు రీస్ట్రక్చరింగ్ ప్లాన్‌కు అనుగుణంగా కార్యాలయాలను విడిచిపెట్టాలని చూస్తోంది. అలాగే కాగ్నిజెంట్ తన మొత్తం రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోను తిరిగి మూల్యాంకనం చేస్తోంది. కొన్ని భౌగోళిక ప్రాంతాల్లో అద్దెకు తీసుకున్న ఆస్తులను విడిచిపెడుతోందని సమాచారం. కొన్ని సందర్భాల్లో అద్దెపై మళ్లీ చర్చలు జరిపినట్లు సమాచారం. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 16 శాతం క్షీణించి 525 మిలియన్లకు చేరుకుంది. అలాగే ఆదాయం దాదాపు 4.89 బిలియన్ డాలర్లుగా ఉందని వెల్లడించింది.
వాస్తవానికి ఐటీ సేవల రంగంలోని కంపెనీలు అత్యంత గడ్డు కాలాన్ని చూస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా క్లయింట్‌లు ఖర్చులను తగ్గించుకోవడానికి, వారి వ్యాపారాలను డిజిటల్‌గా మార్చడానికి, ఉత్పాదక AIని స్వీకరించడానికి కృషి చేస్తున్నందున కాగ్నిజెంట్‌ను ఉత్తమ స్థానంలో ఉంచడానికి తాము పెట్టుబడి పెడుతున్నట్లు సీఈవో రవికుమార్ పేర్కొన్నారు. మూడో త్రైమాసికం ముగింపు నాటికి కంపెనీ ఉద్యోగుల సంఖ్య 3,46,600గా ఉన్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలోనే సర్దుబాటు చేసిన ఆపరేటింగ్ మార్జిన్ మార్గదర్శకాన్ని 14.7%కి కంపెనీ అప్‌డేట్ చేసింది.


Click it and Unblock the Notifications