Cognizant salary Hikes: ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న అనిశ్చిత వ్యాపార వాతావరణంతో టెక్ కంపెనీలు భారీగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. పెద్ద డీల్స్ కొరవడటంతో ఆదాయాలు, మార్జిన్లపై తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీంతో కంపెనీలు తమ ఉద్యోగులకు షాక్ ఇస్తున్నాయి.
తాజాగా టెక్ దిగ్గజాల్లో ఒకటిగా కొనసాగుతున్న కాగ్నిజెంట్ తన ఉద్యోగులకు వేతన పెంపులపై సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా కేంద్రంగా టెక్ సేవలు అందిస్తున్న కంపెనీ వాస్తవానికి ఉద్యోగులకు వేతన పెంపులను 4 నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే శాలరీ హైక్స్ ఆగస్టు నుంచి రోలవుట్ అవుతాయని కంపెనీ పేర్కొంది. ఇదే క్రమంలో కంపెనీ మరోపక్క ఉద్యోగుల సంఖ్యలను వేగంగా తగ్గిస్తూ ఏఐ వినియోగాన్ని అమలులోకి తీసుకొస్తోంది.

వార్షిక మెరిట్ పెంపుదల, బోనస్‌ల ద్వారా తమ ఉద్యోగుల కృషి, అంకితభావాన్ని గుర్తించడానికి తాము కట్టుబడి ఉన్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. పెంపులకు అర్హులైన ఉద్యోగులకు వేతన పెంపులు ఆగస్టు 1 నుంచి అందించబడతాయని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా కంపెనీకి మెుత్తంగా 3,47,700 మంది ఉద్యోగులు ఉండగా.. కేవలం భారతదేశంలోనే 2,50,000 మందిని కలిగి ఉంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కాగ్నిజెంట్ ఆదాయం 1.7 శాతం క్షీణించి ఏడాది ప్రాతిపదికన $4.76 బిలియన్లుగా నమోదైంది.
కంపెనీ గడచిన మూడేళ్ల కాలంలో నాలుగు సార్లు శాలరీ హైక్స్ ప్రకటించింది. అక్టోబర్ 2021, అక్టోబర్ 2022, ఏప్రిల్ 2023 తర్వాత చివరిగా ఏప్రిల్ 1, 2023న కాగ్నిజెంట్ తన ఉద్యోగులకు వేతనాలను పెంచింది. కంపెనీ మునుపటి సంవత్సరంతో పోలిస్తే 2023లో 7,600 మంది ఉద్యోగుల సంఖ్యను 3,47,700కి తగ్గించింది. కాగ్నిజెంట్ కూడా స్వచ్ఛంద అట్రిషన్‌లో మునుపటి సంవత్సరంలో 25.6 శాతం నుంచి 2023లో 13.8 శాతానికి తగ్గినట్లు నివేదించింది.


Click it and Unblock the Notifications