Cognizant News: భారతదేశంలోని యువతతో పాటు వారి తల్లిదండ్రులకు సైతం ఐటీ జాబ్ అంటే ఎంతో మక్కువ. ఎందుకంటే లైఫ్ కంఫర్టబుల్ గా నడిచేందుకు అవసరమైన డబ్బుతో పాటు సొసైటీలో హోదా వంటి అనేక అంశాలను చాలా మంది దీనికి కారణంగా చెబుతుంటారు. మరికొందరు తమ పిల్లలు తమలాగా కష్టపకూడదని కోరుకుంటుంటారు. ఇలా అనేక కారకాలు చాలా మంది యువతను నేడు ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జాబ్ కోసం వెతికేలా చేస్తున్నాయి.
అయితే ప్రపంచ ఆర్థిక మందగమనం సమయంలో ఐటీ కంపెనీలు భారీగా ఎదురుదెబ్బలు ఎదుర్కోవటంతో వాటిలో ఉద్యోగ అవకాశాలు సైతం గడచిన రెండేళ్లుగా మందగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల కాగ్నిజెంట్ నిర్వహించిన ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ పెద్ద చర్చకు దారితీసింది. అందులో తక్కువ వార్షిక వేతనాలు అందించటంపై పలు విమర్శలతో పాటు సమర్థింపులు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఈ వివాదంపై టెక్ మేజర్ ఒక క్లారిటీని నేడు ప్రకటించింది.

కొత్త ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌లకు పుణ్యాలతో పాటు పరిశ్రమ గుర్తింపు పొందిన సర్టిఫికేషన్‌ల వంటి అంశాల ఆధారంగా రూ.4 నుంచి రూ.12 లక్షల వరకు వేతనాన్ని అందజేస్తున్నట్లు కాగ్నిజెంట్ అమెరికాస్ ప్రెసిడెంట్ సూర్య గుమ్మడి స్పష్టం చేశారు. కాగ్నిజెంట్ తన ప్రతిభపై పెట్టుబడి పెట్టడానికి, అధునాతన డిజిటల్ టెక్నాలజీలలో శిక్షణను అందించడానికి, ఉన్నత విద్యను స్పాన్సర్ చేయడానికి, నాయకత్వ అభివృద్ధి కార్యక్రమాలను అందించడానికి కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న రూ.2.52 లక్షల వార్షిక ప్యాకేజీని నాన్ ఇంజనీరింగ్ డిగ్రీ హోల్డర్లకు ఆఫర్ చేస్తున్నట్లు వెల్లడించారు.
కాగ్నిజెంట్ నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌లను అడ్మినిస్ట్రేటివ్, ఇతర పాత్రల కోసం తీసుకుంటుంది. ఈ క్రమంలో వారి శిక్షణ, నైపుణ్యం కోసం భారీగా ఏడాదికి రూ.2-3 లక్షల వరకు కంపెనీ వెచ్చిస్తుందని గుమ్మడి వెల్లడించారు. కంపెనీలో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఏకకాలంలో కొనసాగుతున్నందున గందరగోళం ఏర్పడిందని తక్కువ వేతనాలపై ఆయన స్పష్టత ఇచ్చారు. ఇదే క్రమంలో ఇటీవలి హైక్స్ కేవలం 1శాతం ఇచ్చారనే వార్తపై స్పందిస్తూ కంపెనీ వ్యక్తిగత పనితీరు ఆధారంగా కంపెనీ ఇచ్చిన 1-5 శాతం వార్షిక జీతం పెరుగుదలను కాగ్నిజెంట్ అందించిందన్నారు. ఈ ఏడాది భారతదేశంలో ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, బోనస్‌లను అందించినని కొన్ని IT కంపెనీల్లో తాము ఒకరమని కంపెనీ వెల్లడించింది.
కాగ్నిజెంట్‌కు భారత్ గుండె అని గుమ్మడి అన్నారు. ఇటీవల తాము భువనేశ్వర్, ఇండోర్‌లో కార్యాలయాలను ప్రారంభించిన విషయాన్ని వెల్లడించారు. ఇదే క్రమంలో హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను విస్తరించిన విషయాన్ని వెల్లడించారు. అసోసియేట్‌లకు శిక్షణ ఇవ్వడం, వారి నైపుణ్యాలను మెరుగుపరచడంలో నిరంతరం పెట్టుబడి పెడుతున్నామని గుమ్మడి వెల్లడించారు. ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లతో పాటు సైన్స్, ఆర్ట్, కామర్స్ కాలేజీల నుంచి కూడా కొత్త రిక్రూట్‌మెంట్‌లు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications