Accenture News: వాస్తవానికి యాక్సెంచర్ కంపెనీ అమెరికా కేంద్రంగా పనిచేస్తున్నప్పటికీ దానికి ఎక్కువ స్థాయిలో ఉద్యోగులు భారతదేశంలోనే ఉన్నారు. ప్రస్తుతం టెక్ రంగం మెల్లగా కుదుటుపడుతోంది. దీనికి తోడు యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల తగ్గింపుతో వ్యాపారులు తిరిగి పుంజుకుని పూర్వ వైభవాన్ని చూడనున్నాయని విశ్లేషకులు అంచనాల మధ్య టెక్ మేజర్ మాత్రం సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది.
గత కొన్నేళ్లుగు టెక్ రంగాన్ని పీడిస్తున్న మందగమనం, గ్లోబల్ ఆర్థిక సంక్షోభాలు తీవ్రంగా దెబ్బతీశాయి. అయితే తీరా ఈ పరిస్థితులు స్థిమితపడుతున్న వేళ ప్రధాన టెక్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న యాక్సెంచర్ చివరి నిమిషంలో చేతులెత్తేసింది. 2023 ఆర్థిక సంవత్సరంలో భారతీయ టెక్ ఉద్యోగులకు వేతన పెంపులను నిలిపివేసిన తర్వాత తాజాగా యాక్సెంచర్ మరో కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం కంపెనీ తన గ్లోబల్ ఉద్యోగులకు ప్రమోషన్ సైకిల్ డిసెంబర్ నుంచి జూన్ కు మార్చుతున్నట్లు సంచలన ప్రకటన చేసింది. వాస్తవానికి మరికొన్ని నెలల్లో కంపెనీ నుంచి శుభవార్తలు అందుకుందామని ఎదురుచూస్తున్న చాలా మంది టెక్ ఉద్యోగులు ఈ వార్త వినటంతో ఒక్కసారిగా షాక్ కి గురవుతున్నారు.

భారతీయ ఐటీ పరిశ్రమలో ప్రస్తుతం కేవలం టాటాలకు చెందిన టీసీఎస్ మినహా ఇతర ప్రధాన ఆటగాళ్లు వ్యాపార మందగమనాన్ని పేర్కొంటూ వేరియబుల్ పే, జీతాల పెంపు, ఉద్యోగులకు ప్రమోషన్లను తగ్గించాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు జీతాల పెంపును ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 7 లక్షలకు పైగా ఉద్యోగులను కలిగి ఉన్న యాక్సెంచర్ సాధారణంగా డిసెంబర్‌లో నిర్వహించే ప్రమోషన్ సైకిల్ ఇప్పుడు జూన్‌కి మార్చబడిందని తన ఉద్యోగులకు మెయిల్ ద్వారా తెలియజేసింది. అంటే ఈ లెక్కన కంపెనీలో ప్రమోషన్లు ఆశిస్తున్న ఉద్యోగులు శుభవార్త వినాలంటే కనీసం 6 నెలలు ఆగాల్సిఉంటుంది. ప్రమోషన్‌తో పాటు వచ్చే జీతం పెంపుపై కూడా దీని ప్రభావం ఉండనుందని తెలుస్తోంది.
ప్రపంచ ఒడిదొడుకులతో వ్యాపార పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న యాక్సెంచర్ ఆర్థిక వనరులు, అంతర్గత అవసరాలకు అనుగుణంగా హైక్ సైకిల్ రివైజ్ చేసినట్లు తెలుస్తోంది. కొత్త ప్రమోషన్ సైకిల్ వ్యవధి కంపెనీ తన కస్టమర్ వ్యూహాలను, మార్కెట్‌లో వ్యాపార డిమాండ్ స్థాయిలను మెరుగ్గా అంచనా వేయడానికి సహాయపడుతుందని యాక్సెంచర్ ప్రతినిధి వెల్లడించారు. కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని వార్తలు బయటకు రావటంతో కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో పతనాన్ని చూశాయి. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ కంపెనీల క్లయింట్లు జాగ్రత్తగా ఖర్చులను కొనసాగిస్తుండటంతో చాలా టెక్ కంపెనీలు ఆదాయాల పరంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవటం ప్రస్తుత పరిస్థితులకు కారణంగా టెక్ రంగంలోని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications