Accenture News: ఐటీ కంపెనీల గురించి రోజుకొక సంచలన వార్త వెలుగులోకి వస్తోంది. ఈ క్రమంలో దిగ్గజ కంపెనీల దారి ఇప్పుడు ఒక్కటేనని తెలుస్తోంది. దేశీయ కంపెనీలతో పాటు గ్లోబర్ టెక్ కంపెనీలు సైతం అలాగే ప్రవర్తిస్తున్నాయి.
మునుపటి నెలలో టెక్ దిగ్గజం యాక్సెంచర్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగులకు వేతన పెంపులను తాత్కాలికంగా నిలిపివేయాలనే తన నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటించింది. అయితే ఇంక్రిమెంట్‌లు చట్టబద్ధంగా అవసరమయ్యే లేదా ముఖ్యమైన నైపుణ్యం ఉన్న రంగాల్లో అవసరమైన మేరకు మాత్రమే అందించనున్నట్లు స్పష్టం చేసింది.

కంపెనీ తీసుకున్న నిర్ణయాన్ని మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ విజ్ ఈ-మెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేశారు. ఇదే క్రమంలో యాక్సెంచర్ ప్రమోషన్లు, ప్రోత్సాహకాలపై దాని వ్యూహాన్ని మార్చుకుంది. పనితీరు-ఆధారిత ప్రోత్సాహకాలు అందించబడతాయని ఊహించబడినప్పటికీ.. గత సంవత్సరంతో పోలిస్తే వాటి పరిమాణం చాలా తక్కువగా ఉంటుందని అంచనా వేయబడింది. అసోసియేట్ డైరెక్టర్ స్థాయి (లెవల్ 5) వరకు ప్రమోషన్లు డిసెంబర్‌లో షెడ్యూల్ చేయబడ్డాయి.
ఇదే క్రమంలో లెవల్ 1 నుంచి 4లోపు స్థాయి ఉద్యోగులకు పదోన్నతులు 2024 జూన్ నెల వరకు వాయిదా వేయబడ్డాయి. ప్రపంచ వ్యాపార వాతావరణం డైనమిక్స్ మారుతున్న తరుణంలో కంపెనీ ఆచితూచి ముందుకు అడుగులు వేస్తోంది. భారతీయ టెక్ కంపెనీలు సైతం ఉద్యోగులకు పెద్దగా వేతన పెంపులను అందించటం లేదు. అధిక వేతనాన్ని పొందుతున్న వ్యక్తులకు హైక్స్ వాయిదా వేస్తున్నాయి. ఈ క్రమంలో యాక్సెంచర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) పై గణనీయంగా 3 బిలియన్ డాలర్లను వెచ్చిస్తోంది. ఈ డొమైన్‌లో మొత్తం 80,000 మంది ఉద్యోగులను పెంచే యోచనలో ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications