Bengaluru Techie Suicide: బెంగళూరుకు చెందిన 34 ఏళ్ల ఇంజనీర్ అతుల్ సుభాష్ మరణం దేశవ్యాప్తంగా ప్రజల నుంచి ఆగ్రహానికి కారణమైంది. ఆడవాళ్లకు ఒక న్యాయం మగవాళ్లకు మరో న్యాయమా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సీనియర్ ఐటీ ప్రొఫెషనల్ సుభాష్ తన ప్రాణాలను తీసుకోవటానికి ముందు 24 పేజీల సూసైడ్ నోట్, 90 నిమిషాల వీడియోలో తాను ఎదుర్కొన్న సమస్యను వివరించాడు. ఇందులో తన భార్య, ఆమె కుటుంబం, కోర్టు న్యాయమూర్తి కలిగించిన వేధింపుల గురించి స్పష్టంగా ప్రపంచానికి వెల్లడించాడు.
ఈ క్రమంలో తన భార్య ఫామిలీతో పాటు జౌన్‌పూర్‌లోని ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి రీటా కౌశిక్‌ను కూడా ఇంప్లీడ్ చేశాడు. సుభాష్ సోదరుడు బికాస్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు నిందితులపై BNS సెక్షన్ 108, 3(5) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ క్రమంలోనే సుభాష్ భార్య ఉద్యోగం చేస్తున్న యాక్సెంచర్‌పై నెటిజన్లు, సాధారణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతుల్ సుభాష్ మరణానికి కారణమైన హంతకురాలిని ఉద్యోగం నుంచి తొలగించటానికి 24 గంటలు సమయం ఇస్తున్నట్లు ఒక నెటిజన్ ట్వీట్ చేశారు. ఆమె కంపెనీలో ఏ స్థాయిలో పనిచేస్తున్నప్పటికీ వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని, ఇలాంటి వారిని టెక్ కంపెనీలు బ్లాక్ లిస్ట్ చేయాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో చాలా మంది ఐటీ ఉద్యోగులు అతుల్ సుభాష్ భార్య పనిచేస్తున్న బెల్లందూరులోని ఎకోస్పేస్ బిజినెస్ పార్క్‌లోని యాక్సెంచర్ బెంగళూరు కార్యాలయం ఎదుట కొవ్వొత్తుల ప్రదర్శనతో తమ నిరసన వ్యక్తం చేశారు. దాదాపు 100 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే క్రమంలో సుభాష్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని దిల్లీలోని జంతర్ మంతర్ తో పాటు హైదరాబాద్, కలకత్తాలోనూ యాక్సెంచర్ కార్యాలయాలతో పాటు ఛార్మినార్ వద్ద కూడా సంఘీభావం తెలుపుతూ పలువురు నిరసన వ్యక్తం చేశారు. మహిళలకు అన్యాయం జరిగితే వెంటనే స్పందించే చట్టాలు మగవారి విషయంలో ఎందుకలా జరగటం లేదని చాలా మంది ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు.
అయితే ఈ వ్యవహారంపై కామెంట్ చేయాల్సిందిగా ఇప్పటి వరకు యాక్సెంచర్ కంపెనీని కోరినప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే మరోపక్క యాక్సెంచర్ మాత్రం తన ట్విట్టర్ హ్యాండిల్‍ను లాక్ చేసి పెట్టింది. భర్త నుంచి విడిపోతూ రూ.3 కోట్లు భరణం కావాలంటూ టార్చర్ చేసి టెక్కీ సుభాష్ మరణించేవరకు విడిచిపెట్టని నిఖితాను ఉద్యోగంలో ఇప్పటికీ కొనసాగిచంటంపై చాలా మంది యాక్సెంచర్ కంపెనీ ప్రతినిధులు, యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. యాజమాన్యం ఆమెను తొలగించకుండా అండగా నిలబడుతోందా అంటూ సీఈవోను ట్యాగ్ చేస్తూ చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్లో ప్రశ్నించటం మాత్రం ఆపటం లేదు.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Bengaluru: హైదరాబాద్ దూసుకొస్తున్నా.. బెంగళూరు క్రేజ్ తగ్గట్లేదు ఎందుకు?

Layoffs: ఒరాకిల్‌లో భారీ లేఆఫ్స్.. 30 వేల మందిపై వేటు? అసలు కారణం ఇదేనా?

Bengaluru: బెంగళూరు స్టార్టప్ సంచలనం.. 'బజార్నౌ'లోకి భారీగా వస్తున్న పెట్టుబడులు!

బెంగళూరు ఆటో డ్రైవర్ల ఫోన్ వ్యసనంపై హాట్ డిబేట్.. సాప్ట్వేర్ ఇంజనీర్ ఆందోళనపై ఎవరేమన్నారంటే..

Bengaluru: బడ్జెట్లో బెంగళూరు కోసం మాస్టర్ ప్లాన్..! రాబోతున్న కొత్త ప్రాజెక్టులు ఇవే!

Bengaluru: స్టార్టప్ పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ ఎంట్రప్రెన్యూర్ చెప్తున్న చేదు నిజాలు వినాల్సిందే!

IT Jobs: కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఆగండి! ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఓసారి చూడండి!

Bengaluru: ఐటీ రేసులో రివర్స్ గేర్! బెంగళూరును దాటేసిన హైదరాబాద్.. లేటెస్ట్ రిపోర్ట్ ఇది!

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్‌పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..



Click it and Unblock the Notifications