LIC News: ఈ కంపెనీలో వాటాలు పెంచిన ఎల్ఐసీ.. మార్కెట్లో ఇన్వెస్టర్ల కన్ను..
LIC News: దేశంలోని ప్రభుత్వ బీమా సంస్థ ఎల్ఐసీ అనేక కంపెనీల్లో పెట్టుబడులను పెడుతుంటుంది. పాలసీల విక్రయం ద్వారా ప్రజల నుంచి సేకరించిన సొమ్మును ఈక్విటీ మార్కెట్లలో, ప్రభుత్వ పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది.
ఈ క్రమంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓపెన్ మార్కెట్ కొనుగోలు ద్వారా ఐటీ సంస్థ టెక్ మహీంద్రా లిమిటెడ్‌లో తన పెట్టుబడుల వాటాను సుమారు 2 శాతం మేర పెంచుకుంది. ఈ క్రమంలో ఎల్ఐసీ 1.9 కోట్ల షేర్లను సగటున రూ.1,050.77 ధరకు కొనుగోలు చేసినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్స్ ద్వారా వెల్లడైంది.

నవంబర్ 21, 2022- జూన్ 6, 2023 మధ్య కాలంలో ఇన్సూరెన్స్ దిగ్గజం రూ.2,000 కోట్ల విలువైన అదనపు షేర్లను కొనుగోలు చేసింది. దీంతో టెక్ మహీంద్రాలో ఎల్ఐసీ హోల్డింగ్స్ 8.84 శాతానికి పెరిగాయి. ఈ వార్తలు వెలువడిన నేపథ్యంలో టెక్ మహీంద్రా షేర్లపై ఇన్వెస్టర్ల ఫోకస్ పెరిగింది. అనేక మంది టెక్ కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు మెుగ్గు చూపుతున్నారు.
దీంతో నేడు మార్కెట్లో టెక్ మహీంద్రా కంపెనీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. దీంటో ఉదయం ఎన్ఎస్ఈలో రూ.1,101 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన షేర్లు ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో 11.41 సమయంలో షేర్ ధర రూ.1,091.60 వద్ద కొనసాగుతోంది. 2023లో ఇప్పటి వరకు స్టాక్ దాదాపు 8 శాతానికి పైగా రాబడిని అందించింది. అలాగే స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.1,165 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.943.70 వద్ద ఉంది.


Click it and Unblock the Notifications