IT News: చాలా కాలంగా ఉద్యోగులను కలవరపెడుతున్న అసలు విషయం జాబ్ గ్యారెంటీ. ప్రస్తుతం మారిపోతున్న టెక్నాలజీలు, వేగంగా మారిపోతున్న జాబ్ మార్కెట్ వంటి కీలక పరిణామాల మధ్య మనుగడపై ఆందోళనలు టెక్కీల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి.
వీటిలో మరీ ముఖ్యంగా ఇబ్బంది పెడుతున్న విషయం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్. ఇది మానవుల మేధస్సు కంటే అనేక రెట్లు ఎక్కువగా పనిచేయటం వల్ల తమ ఉద్యోగాలు పోతాయని చాలా మంది టెక్కీలు భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ పనులను పూర్తి చేసేందుకు ఏఐ టూల్స్ విరివిగా వినియోగిస్తున్నారు. తద్వారా ఖర్చులు తగ్గించుకోవచ్చని కంపెనీలు భావిస్తున్న మాట కూడా వాస్తవమే. దీనికి ఉదాహరణ గతంలో టెక్నాలజీ దిగ్గజమైన ఐబీఎమ్ చేసిన ప్రకటన.

అయితే తాజాగా AI ఆందోళనల గురించి టెక్ మహీంద్రా ఎండి, సీఈవో మోహిత్ జోషి శనివారం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టెక్నాలజీ రెవల్యూషన్ లో భారత్ ఇప్పటికీ ప్రారంభదశల్లోనే ఉందని పేర్కొన్నారు. అలాగే రాబోయే పదేళ్ల కాలంలో టెక్ రంగంలో ప్రతి సంవత్సరం దశాబ్దాల విలువైన మార్పును తప్పక చూడాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ మార్పులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జెనోమిక్స్, నానోటెక్నాలజీ, రోబోటిక్స్‌లో పురోగతి ద్వారా నడపబడతాయని అన్నారు.
IIM నాగ్‌పూర్‌లోని 'జీరో మైల్ సంవాద్'లో మాట్లాడుతూ మోహిత్ AI ప్రోగ్రామింగ్ ఉద్యోగాలను అనవసరంగా చేస్తుందా అనే అంశంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఏఐ ప్రోగ్రామింగ్ ను మరింత సులభతరం చేయటంలో దోహదపడుతుందని అన్నారు. యావరేజ్ ప్రోగ్రామర్ సైతం గతంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారితో సమానం చేస్తుందని అన్నారు. ఈ సాంకేతికత విన్నర్స్, రన్నర్స్ ను సృష్టించినప్పటికీ ఎక్కువగా విజేతలు ఉంటారని అభిప్రాయపడ్డారు.
రానున్న దశాబ్ద కాలంలో టెక్ రంగం డబుల్ డిజిట్ గ్రోత్ నమోదు చేస్తుందని అన్నారు. ఐటీ సేవల పరిశ్రమ భవిష్యత్తులో చాలా పెద్దదిగా మారుతుందని, అందుకు అనుగుణంగా ప్రతిభకు డిమాండ్ ఉంటూనే ఉంటుందని జోషి పేర్కొన్నారు. అయితే మెుత్తానికి AI కారణంగా ప్రోగ్రామింగ్ ప్రతిభకు డిమాండ్ తగ్గే ప్రమాదాలు లేవని మోహిత్ చెప్పకనే చెప్పారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications