దేశ ఐటీ రాజధాని, సిలికాన్ వ్యాలీ అయిన బెంగుళూరు ఇప్పుడు ఐటీ సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. టాప్ కంపెనీలు లేఆప్స్ బాటపడుతున్నాయి. ఉద్యోగులు రోడ్డు మీదకు వస్తున్నారు.కాలేజీ నుంచి ఇంజనీరింగ్ అందుకోగానే నిరుద్యోగులంతా బెంగుళూరులో వాలిపోతారు. ఈ నేపథ్యంలోనే బెంగుళూరు పీజీలు కళకళలాడుతుంటాయి. అయితే తాజాగా నెలకొన్న ఐటీ సంక్షోభం వల్ల బెంగుళూరులో పీజీలు ఖాళీ అవుతున్నాయి.
కంపెనీలు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతుండటంతో అందరూ పీజీలు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. చాలా చోట్ల పీజీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల అయితే నష్టాల బాట పట్టిన యజమానులు పీజీలను మూసివేస్తున్నారు. ఐటీకీ కేరాఫ్ అడ్రస్ అయిన ఎలక్ట్రానిక్ సిటీ, మార్తహళ్లి ఏరియాల్లో చాలా చోట్ల పీజీలు మూతపడుతున్నాయి.దూసుకొస్తున్న ఆర్థికమాంద్యంతో ఐటీ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి.ఈ నేపథ్యంలోనే తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

కరోనా మహమ్మారి ఇప్పటికే బెంగుళూరు నగరాన్ని భారీగా దెబ్బతీసింది. ఈ దెబ్బ నుంచి నెమ్మదిగా కోలుకున్న పీజీ యజమానులు ఇప్పుడిప్పుడే కొంచెం ఆర్థికంగా స్థిరపడుతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పరిస్థితులు, దూసుకొస్తున్న ఆర్థిక మాంద్యం భయాలతో కంపెనీలు ఉద్యోగులను బయటకు పంపడంతో మళ్లీ వీరి పరిస్థితి మొదటికొచ్చింది. టెక్ లేఆఫ్స్ తో పీజీలు ఖాళీ చేసి వెళుతున్న వారిసంఖ్య పెరుగుతుండటంతో పీజీ యజమానులు ఆందోళన చెందుతున్నారు.
దేశంలో ఐటీలోఅగ్రగామిగా ఉన్న బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP)కు ఇప్పుడు కష్టకాలం ఎదురయిందనే చెప్పుకోవాలి. దాదాపు పీజీలను ఖాళీ చేస్తున్న విద్యార్థులతో నష్టం 25 శాతానికి పైగా పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే చాలామంది చిన్న వ్యాపారులు తమ వ్యాపారాలను మూతవేసే పరిస్థితి నగరంలో కనిపిస్తోంది. మార్తహళ్లి, సర్జాపూర్,ఎలక్ట్రానిక్ సిటీ, మడివాళ, కేఆర్ పురం, హెబ్బాల్, జయనగర్, కోరమంగళ వంటి ఏరియాల్లో ఒకప్పుడు సందడిగా ఉన్న పీజీలు ఇప్పుడు గెస్ట్ లు లేక వెలవెలబోతున్నాయి.
ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నెమ్మదిగా పీజీ పరిశ్రమ కుప్పకూలిపోతోంది. అయితే నాలుగు అయిదు వ్యాపారాలు చేసే యజమానులు కాస్త నిలదొక్కుకుంటున్నప్పటికీ చిన్న కారు వ్యాపారులు మాత్రం దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళారు. వారు పీజీని మూసివేసి సొంతూర్లకు వెళ్లిపోతున్నారు. ఇప్పుడు ఆ భవనాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. యజమానులు నష్టాలతో పీజీలు ఎలా నడపాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఆగస్టు నెల 2024లో జరిగిన క్రూరమైన హత్యతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంగతి విదితమే. బీబీఎంపీ, నగర పోలీసులు వెంటనే రంగంలోకి దిగి మహదేవపురలోని 100 పీజీలను సీజ్ చేశారు. అక్కడ లైసెన్స్ లేకుండా పీజీలు నడుపుతున్నట్లు గుర్తించారు. ఇవి బెంగుళూరు ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించినట్లుగా గుర్తించారు. ఈ ఘటన కూడా బెంగుళూరు నగరంలో పీజీల అంశాన్ని ఆందోళనలోకి నెట్టేసింది.
బెంగుళూరులో మరో నిబంధన పీజీల పాలిట శాపమైంది. పీజీలకు వెడల్పాటి రహదారులు ఉండాలని, నలబై అడుగుల కంటే ఇరుకైన రోడ్లపై పీజీలు నడపరాదనే కఠినమైన నిబంధన పీజీ యజమానులను మరింత అగాధంలోకి నెట్టేసింది. ఈ నియమ నిబంధనలు బెంగుళూరులో చాలా పీజీలను దెబ్బతీసిందని బెంగళూరు పీజీ యజమానుల సంఘం కార్యదర్శి సుఖి సియో చెబుతున్నారు. ఈ నియమంతో చాలా పీజీలు మూతపడాల్సి వచ్చిందన్నారు. దీంతో పాటుగా బెంగుళూరు నగరంలో కొనసాగుతున్న నీటి సంక్షోభం, విద్యుత్ ఛార్జీలు పీజీల పాలిట శాపంగా మారాయనే చెప్పుకోవాలి.
ఈ నేపథ్యంలోనే బెంగుళూరు మహానగరపాలిక కఠిన నిబంధనలను సడలించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆర్థిక వ్యవస్థకు దెబ్బపడే ఆలోచన ఉండటంతో కొన్ని నిబంధనలను వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో 40 అడుగుల రోడ్డు ఉండాలనే నిబంధనను ఎత్తివేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కేవలం ఈ ఏడాది ప్రభుత్వం 2500 పీజలను మాత్రమే అధికారికంగా నమోదు చేసిందంటే.. ఏ స్థాయిలో సంక్షోభం ఉందో అర్థం చేసుకోవచ్చు.
దేశ ఐటీ రాజధానిలో అవకాశాలను వెతుక్కునేందుకు వచ్చేవారి సంఖ్య ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. ఇండియా సిలికాన్ వ్యాలీలో ఇళ్లు అద్దెకు తీసుకోవాలంటే వారికి తలకు మించిన భారం అవుతోంది. ఈ నేపథ్యంలోనే బెంగుళూరులో ఉద్యోగం కోసం దిగేవారు పీజీలు వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే తాజాగా బెంగుళూరులో నెలకొన్న లేఆప్స్ ఆందోళనతో వారు కూడా ఆలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. దీంతో అటు ఉద్యోగం చేసేవారు..ఉద్యోగం వెతుక్కునే వారు ఇద్దరూ బెంగుళూరు నగరాన్ని వీడటం పీజీ యజమానులకు నష్టాలను తెచ్చిపెడుతోంది. మరి భవిష్యతులో బెంగుళూరు నగరం ఐటీలో ఎలా ఉంటుంది, పీజీల పరిస్థితి మెరుగుపడుతుందా లేదా అనేది చూడాలి.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Bengaluru: బెంగళూరులో సామాన్యుడు బ్రతకగలడా? వైరల్ అవుతున్న టెక్కీ నెలవారీ ఖర్చుల చిట్టా!

Bengaluru: హైదరాబాద్ దూసుకొస్తున్నా.. బెంగళూరు క్రేజ్ తగ్గట్లేదు ఎందుకు?

Bengaluru: బెంగళూరు స్టార్టప్ సంచలనం.. 'బజార్నౌ'లోకి భారీగా వస్తున్న పెట్టుబడులు!

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్.. తిండి కోసం విలవిలలాడుతున్న ఫుడ్ ప్రేమికులు..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

Bengaluru: స్టార్టప్ పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ ఎంట్రప్రెన్యూర్ చెప్తున్న చేదు నిజాలు వినాల్సిందే!



Click it and Unblock the Notifications