టెక్ రంగంలో జరుగుతున్న పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతుంది. కొత్త ఏడాది నుండి ఉద్యోగవకాశాలు మెరుగుపడతాయనుకుంటే సాఫ్ట్ వేర్ కంపెనీలు మాత్రం పదులు, వందల సంఖ్యలో ఇలా ఉద్యోగులను తొలగిస్తూ ఇంటికి పంపిస్తున్నాయి. ఈ తరుణంలో మరో దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ సుమారు 45 మంది ట్రైనిలను తొలగించింది. ఇన్ఫోసిస్ మైసూరు క్యాంపస్లో ఇంటర్నల్ అసెస్మెంట్లో ఉత్తీర్ణత సాధించని ట్రైనిలపై వేటు వేసింది. అర్హత సాధించడానికి మూడు అవకాశాలు వచ్చినప్పటికీ ఉత్తీర్ణులవ్వలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్గాలు తెలిపాయి. గత 45 రోజుల్లో మైసూరు కేంద్రంలో ఇలాంటి తొలగింపులు జరగడం రెండవసారి. గత నెల ఫిబ్రవరిలో ఇన్ఫోసిస్ మైసూరు క్యాంపస్‌లో దాదాపు 350 మంది ఫ్రెషర్లు ఇంటర్నల్ అసెస్మెంట్ క్లియర్ చేయడంలో ఫెయిల్ అయిన వారిని తొలగించిన సంగతి మీకు తెలిసిందే.

ట్రైనీలను తొలగించడానికి ఇదే కారణం: ఈ ట్రైనీలు ఫైనల్ ఇంటర్నల్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ క్లియర్ చేయలేకపోయారని ఇన్ఫోసిస్ తెలిపింది. ఈ కారణంగానే వారిని ఉద్యోగం నుండి తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే తొలగించిన వారికి కన్సల్టెన్సీ అండ్ అవుట్ ప్లేస్‌మెంట్ సర్వీసెస్ లభిస్తాయి. దీనితో పాటు, వారికి బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్‌లో 12 వారాల ఎక్స్టెర్నల్ ట్రైనింగ్ ప్రోగ్రాం తీసుకునే అవకాశం కూడా ఇస్తుంది.
ఇమెయిల్ ద్వారా సమాచారం: తొలగించిన ట్రైనీలకు ఇమెయిల్ ద్వారా సమాచారం అందించింది. కంపెనీ పంపిన ఈమెయిల్‌లో ఉద్యోగులు ఫైనల్ ఎవాల్యుయేషన్ ప్రయత్నంలో విఫలమయ్యారని పేర్కొంది. అదనపు సమయం, ఆసెస్మెంట్ కోసం వివిధ అవకాశాలు ఇచ్చినప్పటికీ, వారు ఫెడరల్ స్కిల్ టైనింగ్ ప్రోగ్రాం అర్హత ప్రమాణాలను అందుకోలేకపోయారని ఉద్యోగులకు తెలిపింది.
కఠినమైన నియామక ప్రక్రియ తర్వాత ఇంటర్నల్ ఎసెస్మెంట్ నిర్వహించబడుతుందని, అందులో విజయం సాధించిన వారికి మాత్రమే ఉద్యోగం లభిస్తుందని ఇన్ఫోసిస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రక్రియలో ఉత్తీర్ణత సాధించడానికి ఫ్రెషర్లకు మూడు అవకాశాలు ఉంటాయి. వారు ఈ మూడు ప్రయత్నాలలో విఫలమైతే సంస్థతో కలిసి పనిచేయలేరు.
గతంలో ఉద్యోగుల తొలగింపులపై తీవ్ర దుమారం: ఫిబ్రవరి 2025లో కూడా ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్‌లో మూడుసార్లు ఇంటర్నల్ ఎసెస్మెంట్లో విఫలమైనందుకు దాదాపు 350 మంది ట్రైనీలను తొలగించింది. ఈ విషయంలో చాలా గొడవ కూడా జరిగింది, ఉద్యోగులు కంపెనీ తమను అన్యాయంగా తొలగిస్తుందని ఆరోపించారు. అదే రోజు మమ్మల్ని క్యాంపస్ వదిలి వెళ్ళలని కోరిందని, ఈ చర్య తీవ్ర ఇబ్బంది ఇంకా కోపాన్ని తెప్పించిందని ఉద్యోగులు చెప్పారు. NITES ఈ విషయాన్ని లేబర్ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ జోక్యం కోరింది. దీని తరువాత ఫిబ్రవరి 16-17 నాటికి కేంద్ర ప్రభుత్వం కర్ణాటక లేబర్ కమిషనర్‌ను దర్యాప్తు చేయాలని ఆదేశించింది.


Click it and Unblock the Notifications