అమెరికన్ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ కష్టకాలంలో కొట్టుమిట్టాడుతుంది. దింతో కంపెనీ ఈ వారంలో మరోసారి భారీగా ఉద్యోగులను తొలగించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే కంపెనీ కొత్త CEO లిప్-బు టాన్ కంపెనీని మెరుగుపరచడానికి ఒక కొత్త ప్లాన్ పై పని చేస్తున్నారని వెల్లడైంది. అలాగే కంపెనీ మొదటి త్రైమాసిక ఫలితాలను విడుదల చేయడానికి ఒక రోజు ముందే ఉద్యోగాలను తగ్గించే చర్య తీసుకుంది.

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, కంపెనీ CEO లిప్-బు టాన్ ఇంటెల్ 20% కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నారు. 2024 చివరి నాటికి కంపెనీలో 108,900 మంది ఉద్యోగులు ఉండగా, అంతకుముందు 2024 ఆగస్టులో కూడా కంపెనీ దాదాపు 15 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఔట్‌లుక్ నివేదిక ప్రకారం, కంపెనీ ప్రస్తుత సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే, 20% ఆధారంగా 21 వేల మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది.
కొత్త CEO కంపెనీలో అనవసరమైన ఖర్చులను తగ్గించి ఇంజనీరింగ్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాలని యోచిస్తున్నట్లు ఒక రిపోర్టు పేర్కొంది. మార్చిలో కోల్పోయిన పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకువస్తానని, తయారీ ప్రక్రియలను క్రమబద్ధీకరిస్తానని ఇంకా ఇంటెల్ ఫైనాన్షియల్ పరిస్థితిని మెరుగుపరుస్తానని ఆయన అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల పై ప్రభావం: ఈ తొలగింపులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఇంటెల్ ఉద్యోగులపై ప్రభావం పడనుంది. నిజానికి, ఇంటెల్ చిప్స్ తయారి చేయడంలో కూడా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ కంపెనీ తన వ్యాపారాన్ని సులభంగా చేసుకోవడమే కాకుండా ఖర్చులను కూడా అదుపులో లేదా తగ్గించుకోవాలని అనుకుంటుంది. గత కొంత కాలంగా ఇంటెల్ మార్కెట్ వాటా కూడా క్షీణించింది అంతేకాక Nvidia, AMD వంటి కంపెనీల నుండి గట్టి పోటీ పెరిగింది.
గత సంవత్సరం కూడా ఇంటెల్ ఒకేసారి 15 వేల మంది ఉద్యోగులకి స్వస్తి పలకగా, 2024 చివరి నాటికి ఇంటెల్ లో మొత్తం 108,900 మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే గత ఏడాది ప్రారంభంలో చూస్తే 124,800 ఉద్యోగులు ఉన్నారు. ఇప్పుడు ఊహించని రీతిలో భారీగా ఉద్యోగులను తగ్గించడం జాబ్ మార్కెట్ పెద్ద షాక్ చూడబడుతోంది.
ఖర్చుల తగ్గింపు ప్రయత్నాలలో భాగంగా ఇంటెల్ తాజాగా ఆల్టెరా ప్రోగ్రామబుల్ చిప్ యూనిట్లో మెజారిటీ వాటాను సిల్వర్ లేక్‌కు $4.46 బిలియన్లకు అమ్ముతున్నట్లు ప్రకటించింది. ఒహియోలో కొత్త ఫ్యాక్టరీని నిర్మించాలనే ప్లాన్ కూడా కంపెనీ వాయిదా వేసింది. నేడు బుధవారం షేర్స్ ట్రేడింగ్ పరంగా ఇంటెల్ స్టాక్ (INTC) భారీగా పెరిగింది. దింతో స్టాక్ ధర దాదాపు 3.56% పెరిగి $19.51కి చేరుకుంది.


Click it and Unblock the Notifications