టెక్ ఉద్యోగులంతా రోడ్డు మీదకు వచ్చే సమయం ఆసన్నమైంది..ముందే చెప్తున్నామంటూ సీఈఓల వార్నింగ్..

AI Could Take Over Software Engineers Jobs? కరోనా మహమ్మారి తర్వాత ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారయింది. ఎప్పుడు తమ ఉద్యోగం ఊడుతుందో తెలియక ఇప్పటికీ ఉద్యోగులు భయంతో బతుకుతున్నారు. ఆర్థిక మాంద్య భయాలు ఇంకా వీడనే లేదు. ఈ నేపథ్యంలోనే కంపెనీలు కాస్ట్ కటింగ్ కోసం ప్రయత్నిస్తున్నాయి. ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. గత నాలుగేళ్లలో లక్షలాది మంది ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కోలుకుంటున్నాయి. కంపెనీలు ఆర్థికంగా నిలదొక్కుకుని ఉద్యోగులకు భద్రత కల్పిస్తున్నాయి. అయితే మళ్లీ ఏఐ రూపంలో మరో భూతం వచ్చిపడింది.

ఏఐ రాకతో ఈ రంగం ఆ రంగం అని లేకుండా అన్ని రంగాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ఉద్యోగులు చేసే పనిని ఏఐ అవలీలలగా చేస్తుండటంతో కంపెనీలు మళ్లీ ఉద్యోగ కోతలు మొదలుపెట్టాయి. దీంతో ఇప్పుడు లక్షల జీతాలు తీసుకునే సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు భయం పట్టుకుంది. ఏఐ ప్రధానంగా టెక్ రంగం మీదనే ఫోకస్ పెట్టడంతో టెకీల ఉద్యోగాలు గాలిలో దీపంలా మారాయి. ప్రపంచంలోని ప్రముఖ టెక్ కంపెనీలన్నీ ఏఐ మీద తమ దృష్టిని నిలిపాయి. దీంతో ఉద్యోగులను ఇంటికి సాగనంపేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Amazon AI code generation Microsoft AI software development AI in coding 2025 AI software engineer job loss Amazon Microsoft AI code tools future of software jobs AI AI replacing developers AI coding tools 2025 big tech AI automation software engineer future AI CEO AI AI AI AI CEO AI 2025 AI AI AI AI AI 2025 AI AI AI 2025 AI Tech Jobs Threatened

గత మూడేళ్లలో టెక్ కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఇంజనీర్లను ఇంటికి సాగనంపాయి. లేఆప్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇది ఇంతటితో ఆగకుండా ఈ ఏడాది కూడా భారీగానే లేఆప్స్ ఉండనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్ ఇంకా ఇతర దిగ్గజాలు ఇప్పుడు ఏఐ మీద ఫోకస్ పెట్టాయి. దీంతో ఎంట్రీ లెవల్ ఉద్యోగులు అవసరం లేదనే భావనకు కంపెనీలు వచ్చాయి. ఏఐ రాకతో అమెరికాలో లక్షలాది మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోనున్నారని 2025 ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే అధ్యయనంలో వెల్లడైంది.

గూగుల్ ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు ఇప్పుడు దాదాపు 25 శాతం కోడింగ్ ఏఐ ద్వారానే చేస్తుండటంతో దాని ప్రభావం ఆ లెవల్ ఉద్యోగుల మీద పడబోతోంది. ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు డేంజర్ జోన్లో పడ్డాయి. ఇక మీరు అవసరం లేదని కంపెనీలు చెప్పేందుకు ఎంతో దూరంలో లేదని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ సర్వే ప్రకారం.. రాబోయే సంవత్సరాల్లో ఏఐ దెబ్బకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, అకౌంటెంట్లు, మీడియా జర్నలిస్టులు, ఉపాధ్యాయులు ఎక్కువగా ప్రభావితం అవుతారని తెలుస్తోంది.

ఇక అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ ఏఐ గురించి ఈ మధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు కంపెనీ ఉద్యోగులకు అలర్ట్ మెయిల్ కూడా పంపారు. ఆ మెయిల్ ప్రకారం.. ఏఐ శ్రామిక శక్తిని మార్చేయబోతుందని..కాబట్టి భవిష్యత్తులో చాలా పనులకు ఉద్యోగుల అవసరం రాదంటూ 15 లక్షల మంది ఉద్యోగులకు అలర్ట్ మెసేజ్ ఇచ్చారు. అమెజాన్ ఉద్యోగులందరికీ సీఈఓ జూన్ 17న పంపిన మెమోను బట్టి చేస్తే ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడినట్లేనని పలువురు చెబుతున్నారు.

అమెజాన్ సీఈఓ ప్రకటనతో కంపెనీలో వివిధ రంగాల్లో ఉన్న దాదాపు 3.5 లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్తుపై ఇప్పుడు నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పట్ల ఉద్యోగులంతా అవగాహన పెంచుకోవాలని వర్క్ షాప్ లకు వచ్చి శిక్షణ తీసుకోవాలని ఉద్యోగులకు సీఈఓ సూచించారు. ఐఏని త్వరిత గతిన అందిపుచ్చుకునే వారే భవిష్యత్తులో ఉద్యోగ భద్రతతో ఉంటాని అమెజాన్ సీఈఓ చెప్పుకొచ్చారు.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+