భారతదేశ ఐటీ రాజధాని, సిలికాన్ సిటీకి తెలంగాణ రాజధాని హైదరాబాద్ సవాల్ విసరబోతోంది. భారతదేశంలో టెక్నాలజీ రంగంలో ఎక్కువ ఉద్యోగాలు ఇప్పటికీ బెంగళూరు నగరానికి పరిమితమైన సంగతి విదితమే. అయితే ఇటీవల పరిస్థితులు మారుతున్నాయి. హైదరాబాద్ నగరం ఐటి పరిశ్రమలో వేగంగా అభివృద్ధి చెందుతూ, బెంగళూరుతో పోటీ పడుతున్న కొత్త హబ్‌గా పరిణమిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఇప్పుడు సీనియర్ ఇంజనీర్లు, నూతన బృందాల కోసం బెంగళూరుకు బదులుగా హైదరాబాద్‌ను ఎక్కువగా ఎంపిక చేస్తున్నాయి.
గతంలో హైదరాబాద్ ప్రధానంగా బ్యాక్-ఆఫీస్, కాల్ సెంటర్, ప్రాథమిక ఐటి సేవల స్థావరంగా పరిగణించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. డేటా ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), పరిశోధన & అభివృద్ధి (R&D) వంటి అధునాతన, అధిక విలువ కలిగిన రంగాలలో కూడా హైదరాబాద్ నగరం ఆకర్షణీయంగా మారింది.

కంపెనీలు బెంగళూరు నుంచి ఎక్కువ సీనియర్ స్థాయి ఉద్యోగులను హైదరాబాద్‌కు తరలిస్తున్నాయి. అక్కడి సగటు జీతాలను కూడా వేగంగా పెంచుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం తక్కువ ఆపరేటింగ్ ఖర్చులు, వ్యూహాత్మకంగా ఏర్పాట్లు చేసుకున్న IT పార్కులుగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్‌లో ఉన్న ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన IT ఎకోసిస్టమ్, మల్టినేషనల్ కంపెనీలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తోంది.
ఇక హైదరాబాద్‌లో ఆధునిక పరిశోధనా కేంద్రాలు, స్టార్టప్‌ల పెరుగుదల మరో ముఖ్య కారణంగా చెప్పవచ్చు.పరిశోధన, ఆవిష్కరణ రంగంలో నగరానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, బిగ్ డేటా వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన ఉద్యోగులను కంపెనీలు కోరుకుంటున్నాయి. దీనికి హైదరాబాద్ నగరంలో పుల్లు డిమాండ్ ఏర్పడింది.
స్టాఫింగ్ ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నట్టు, బెంగళూరు, హైదరాబాద్ మధ్య గల జీతాల తేడా గణనీయంగా తగ్గుతోంది. కొన్ని సందర్భాల్లో, Hyderabad లో జీతాలు బెంగళూరుతో సమానంగా లేదా ఎక్కువగా కూడా ఉండడం ప్రారంభమయ్యాయి. ఇది యువ టెక్నాలజీ నిపుణులకు, సీనియర్ ఇంజనీర్లకు గమనార్హమైన అవకాశంగా చెప్పుకోవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే సాంకేతిక రంగంలో హైదరాబాద్ భవిష్యత్తులో భారతదేశం యొక్క ప్రధాన ఐటి హబ్‌గా ఎదగడానికి అన్ని పరిస్థితులు రెడీ అవుతున్నాయి. బెంగళూరుకు పోటీగా, ప్రపంచ సంస్థలు కొత్తగా ఈ నగరాన్ని ఐటి ప్రాజెక్టుల కేంద్రంగా మారుస్తున్నాయి. ఈ పరిణామం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు కూడా కొత్త ఉత్తేజాన్ని నింపుతోంది.
ఇక హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో మరో భారీ ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేయడం గురించి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ముఖ్యంగా గోపన్‌పల్లి తండా పరిసరాల్లో, అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం సమీపంలో నిర్మించనున్నది. ఈ ఐటీ పార్క్ రూపొందించడానికి అధికారులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉన్న దాదాపు 439 ఎకరాల భూములను గుర్తించారు.
ఈ కొత్త ఐటీ పార్క్‌ను అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం, గోపన్‌పల్లి ఫ్లైఓవర్, విప్రో క్యాంపస్, తెల్లాపూర్ ఔటర్ రింగ్ రోడ్డుతో సన్నిహితంగా నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రాజెక్ట్ స్థలాన్ని ఎంపిక చేసిన అనంతరం, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, వివరమైన భూముల నివేదిక కూడా రూపొందించారు. ఈ నివేదికలో గోపన్‌పల్లిలోని సర్వే నంబర్లు, భూముల సరిహద్దులు, మ్యాప్లు స్పష్టంగా ఉన్నాయి.
ఇప్పటికే గోపన్‌పల్లి, గోపన్‌పల్లి తండా, వట్టినాగులపల్లి ప్రాంతాల్లో ఐటీ సంస్థల కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికన్ కాన్సులేట్ ప్రారంభం కావడం ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యతను కలిగిస్తోంది. గచ్చిబౌలి, గోపన్‌పల్లి ప్రాంతాల్లో ఇప్పటికే రెండు అత్యాధునిక ఐటీ పార్క్‌లు అభివృద్ధి అవుతున్న నేపథ్యంలో, కొత్త ఐటీ పార్క్‌ను ఏర్పాటుచేయడం ద్వారా ఆ ప్రాంతం మరింతగా ఐటీ రంగానికి హబ్‌గా మారనున్నది.
ఈ కొత్త ప్రాజెక్ట్ విజయవంతంగా అమలులోకి రాలంటే, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ భూముల సమీకరణం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, శక్తివంతమైన కనెక్టివిటీ కీలకం అవుతాయి. గోపన్‌పల్లి-తెల్లాపూర్ ఔటర్ రింగ్ రోడ్, గోపన్‌పల్లి ఫ్లైఓవర్ వంటి ముఖ్య మార్గాలు సమీపంలో ఉండటం ఈ ప్రాజెక్ట్‌ను సులభతరం చేస్తుంది.
More From GoodReturns

Hyderabad: రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లకు గోల్డెన్ ఛాన్స్? బడ్జెట్ తర్వాత మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి?

Hyderabad: హైదరాబాద్ చుట్టూ రింగ్ రైలు.. కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్!

Gold rates: పెరిగిందా.. తగ్గిందా? దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి గోల్డ్ రేట్ల వివరాలు ఇవే..

హైదరాబాద్‌లో గ్యాస్ సంక్షోభం.. రెండు రోజుల్లో రూ.50 కోట్లు నష్టం.. ఇంకా ఆందోళనకర అంశం ఏంటంటే..

Bengaluru: నెలకు రూ. 1.5 లక్షల జీతం.. చేతిలో మిగిలేది ఇంతే! బెంగళూరు టెక్కీ వైరల్ పోస్ట్!

Bengaluru: ఒక్క జీతం నమ్మకుంటే మునిగిపోవడమే! ఐటీ నిపుణులకు CA వార్నింగ్!

Bengaluru: ఆపదలో పుట్టిన ఆలోచన! గ్యాస్ సమస్యకి సామాన్యుడి అద్భుత పరిష్కారం..!

బెంగళూరు నుండి 2 వేల స్సెషల్ బస్సులు.. ఉగాది నాడు ప్రయాణికులకు KSRTC గుడ్ న్యూస్..

Bengaluru: గ్యాస్ కొరత సాకుతో అదనపు బాదుడు.. వైరల్ అవుతున్న బెంగళూరు కేఫ్ బిల్లు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!



Click it and Unblock the Notifications