IT News: టెక్కీలకు డబుల్ ధమాకా.. శుభవార్త చెప్పిన విప్రో, టీసీఎస్.. ఏంటంటే..
IT News: ఒకపక్క ఐటీ రంగంలో అనిశ్చితులు, తగ్గిన ఆదాయాలు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ భారత టెక్ కంపెనీలు మెరుగైన పనితీరు కనబరిచేందుకు కృషి చేస్తున్నాయి. అలాగే తమ ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు రంగంలోకి దిగాయి.
ఈ క్రమంలో ముందుగా టెక్ దిగ్గజం టీసీఎస్ నిన్న తన సెప్టెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. కంపెనీలో పనిచేస్తున్న వారిలో దాదాపు 70 శాతం జూనియర్ టెక్కీలే.. వీరందరికీ 100 శాతం వేరియబుల్ వేతనాన్ని చెల్లించాలని నిర్ణయించినట్లు చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. అలాగే మిగిలిన టెక్కీలకు వారి వ్యాపార యూనిట్ పనితీరు ఆధారంగా వేతనం ఉంటుందని స్పష్టం చేశారు. కంపెనీ మెుదటి త్రైమాసికంలో తన ఉద్యోగులకు 100 శాతం వేరియబుల్ వేతనాన్ని చెల్లించిన సంగతి తెలిసిందే.

ఇక మరో టాప్ టెక్ కంపెనీగా కొనసాగుతున్న విప్రో పండుగకి ముందరే ఉద్యోగులకు సూపర్ న్యూస్ తెలిపింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న కంపనీ మెుదటి త్రైమాసికంలో 80 శాతం వేరియబుల్ వేతనాన్ని ఉద్యోగులకు చెల్లించింది. అయితే వ్యాపారంలో నెలకొన్ని పరిస్థితుల దృష్ట్యా హైక్స్ తాత్కాలికంగా నిలిపివేసింది. కానీ ఇప్పుడు దీనికి సంబంధించిన గుడ్ న్యూస్ వెల్లడించింది.

విప్రో తన ఉద్యోగులకు వేతన పెంపులను డిసెంబర్ 1 నుంచి అందించనున్నట్లు ప్రకటించింది. మెుదటి త్రైమాసిక ఫలితాలు వెలువరించిన తర్వాతే ఇది జరగాల్సి ఉన్నప్పటికీ వాటిని అప్పట్లో వాయిదా వేసింది. రానున్న కొన్ని వారాల్లో పెరిగిన వేతనాలను అందుకోవచ్చని విప్రో చీఫ్ హ్యూమన్ రీసోర్సె్స ఆఫీసర్ సౌరభ్ గోవిల్ గతవారం ఉద్యోగులకు పంపిన ఈమెయిల్ పరిశీలిస్తే అర్థం అవుతోంది. వేతన పెంపులు ఉద్యోగుల పనితీరు ఆధారంగా ఉండనున్నాయి. ఈ క్రమంలో దిగ్గజం టీసీఎస్ మాత్రం 2023-24 ఆర్థిక సంవత్సరానికి తన ఉద్యోగులకు వేతన పెంపులను అందించింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మాత్రం ఈ ఆర్థిక సంవత్సరం సీనియర్ ఉద్యోగులకు వేతనాల పెంపు ఉండదని జులైలోనే తేల్చి చెప్పేసింది.


Click it and Unblock the Notifications