IT News: దేశంలోని ఐటీ ఉద్యోగులు సెప్టెంబర్ 2021 నుంచి అక్టోబర్ 2022 వరకు అద్భుతమైన రోజులను గడిపారు. అప్పట్లో వారి మాటే వేదవాక్కులా కంపెనీలు సైతం మిన్నకుండిపోయాయి. అవసరం మేరకు కంపెనీలు అనేక మందిని కొత్తగా నియమించుకున్నాయి.
అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం, అమెరికా మాంద్యం భాయాలతో పాటు ఇటీవల చాలా దేశాలు దివాలా తీయటం ఆర్థిక రంగాన్ని కుదేలు చేసింది. దీంతో ఐటీ కంపెనీలకు ప్రాజెక్టుల జోరు తగ్గింది. ఈ క్రమంలో టెక్ కంపెనీల నుంచి ఆఫర్ లెటర్లు అందుకున్న 2022, 2023 బ్యాచ్ ఇంజనీరింగ్ విద్యార్థులు అంతులేని ఆన్‌బోర్డింగ్ జాప్యాన్ని ఎదుర్కొంటున్నారు. దాదాపు ఏడాది కిందట నియామక పత్రాలు పొందినప్పటికీ.. నియమించుకున్న కంపెనీల నుంచి జాయిన్ అయ్యే తేదీ గురించి అప్‌డేట్ లేక ఆందోళనలో ఉన్నారు. కొన్ని కంపెనీలు ఈ గడువును పొడిగిస్తూ పోతున్నాయి.

ఈ క్రమంలో స్టాఫింగ్ సంస్థ టీమ్‌లీజ్ డిజిటల్ FY24లో టెక్ నియామకాల్లో 30 శాతం క్షీణతను అంచనా వేయటం ఆందోళనలు కలిగిస్తోంది. బలహీనమైన డీల్ పైప్‌లైన్ కారణంగా దిగ్గజ టెక్ కంపెనీలు రిక్రూట్మెంట్ తగ్గించాలని ప్లానింగ్ లో ఉండటంతో ఫ్రెషర్‌లను నియమించుకోవడం తగ్గించాయి. పైగా ప్రస్తుత అవసరాల కోసం తమ ఉద్యోగులను అప్‌స్కిల్ చేస్తూ కంపెనీలు ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. మరో పక్క ప్రాజెక్టులు లేక చాలా మంది బెంచ్ పైనే కొనసాగుతూ కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దాదాపు 25,000 మంది విద్యార్థులు తమ ఆన్‌బోర్డింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. కంపెనీలు ఆఫర్లను ఆలస్యం చేయటం లేదా రద్దు చేయటం సరైనది కాదని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్‌దాస్ పాయ్ అన్నారు. రెండు మూడు క్వార్టర్లు ఆర్థికంగా నష్టపోయినప్పటికీ.. కంపెనీలు ఫ్రెషర్‌లను ఆన్‌బోర్డ్ చేసి వారికి వెంటనే శిక్షణ ఇవ్వాలని పరిశ్రమ అనుభవజ్ఞులు అంటున్నారు. కొద్ది రోజుల్లో వృద్ధి ఖచ్చితంగా తిరిగి వస్తుందని ఇప్పుడే ఫ్రెషర్‌లను ఆన్‌బోర్డ్ చేసి వారి నమ్మకాన్ని, గౌరవాన్ని పొందడం తెలివైన నిర్ణయంగా హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ మాజీ సీఈవో వినీత్ నాయర్ అన్నారు.
ఇదే సమయంలో ఉత్పాదకత లేకుండా ఎక్కువ జీతాలు పొందుతున్న మిడ్ లెవల్ ఉద్యోగుల భారాన్ని కంపెనీలు తగ్గించుకోవాలని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు ఉద్యోగులకు కృత్రిమ ప్రమోషన్లను మానుకోవాలని అభిప్రాయపడుతున్నారు. అలాగే ష్రెషర్లకు మంచి జీతాలను ఆఫర్ చేయాలని వారు సూచిస్తున్నారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications