TCS, Infosys, Wiproలకు కెనడా కష్టాలు.. ఇప్పటికే పడిపోయిన వికెట్.. టెక్కీలు జాగ్రత్త..
IT News: భారత ఐటీ కంపెనీలకు అమెరికా వ్యాపారం చాలా కీలకమైనదని తెలిసిందే. అయితే ఇండియా నుంచి అవసరమైన సిబ్బందిని తీసుకురావడంలో అనేక సవాళ్లు ఉన్నాయి. ట్రంప్ హయాంలో భారతీయులకు ఎక్కువగా వీసాల నిరాకరణ జరిగిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో దిగ్గజ టెక్ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలు తమ వ్యాపార విస్తరణకు కెనడాను కేంద్రంగా ఎంచుకున్నాయి. ఈ ఏడాది జూలైలో ఇన్ఫోసిస్ ఉత్తర అమెరికా అనుబంధ సంస్థ ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ కెనడాలో.. IPS కెనడా Inc అనే అనుబంధ సంస్థను సృష్టించింది. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై దృష్టి సారించి కెనడాలో ఉన్న కంపెనీలకు సేవలను అందించాలని ప్లాన్ చేసింది. దీనికోసం 2024 నాటికి 8,000 మందిని నియమించుకోవాలని భావించింది.

ఇక టీసీఎస్ విషయానికి వస్తే కెనడాతో ఒక పెద్ద టైఅప్‌ను ప్రకటించింది. రియల్ టైమ్ రైల్వే సర్వీసులను అభివృద్ధి చేసేందుకు డీల్ కుదుర్చుకుంది. మరో ఐటీ దిగ్గజం విప్రో టొరంటోలో Wipro-AWS లాంచ్ ప్యాడ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు జనవరిలో ప్రకటించింది. దీని కారణంగా ఇప్పటికే ఉన్న కస్టమర్లతో పాటు కొత్త వారందరూ క్లౌడ్ సేవకు వేగంగా ట్రాన్స్‌ఫామ్ కాగలరని విప్రో తెలిపింది. అయితే ఈ ప్లాన్స్ మెుత్తం ప్రస్తుత ఉద్రిక్తతలు, ఆరోపణల నేపథ్యంలో వృధాగా మారతాయా అనే ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాకు చెందిన మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థతో ఉన్న ఒప్పందాన్ని కెనడా ఐటీ కంపెనీ Resson Aerosace స్వచ్ఛందంగా రద్దుకు దరఖాస్తు చేసింది. దైపాక్షిక సంబంధాలు దిగజారటంతో కెనడాలోని భారతీయులు, కంపెనీలు, విద్యార్థులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఇరుదేశాలు తమ పౌరులకు ట్రావెల్ అడ్వైజరీలను ఇప్పటికే జారీ చేశాయి.


Click it and Unblock the Notifications