IT News: టెక్కీలకు మెుదలైన మంచి రోజులు.. ఇది అర్థమైందా రాజా..!!
IT News: ప్రపంచ ఆర్థిక సంక్షోభం, మందగమనం ఎక్కువగా ఐటీ, టెక్ రంగంలోని ఉద్యోగులను ప్రభావితం చేసింది. కంపెనీలు సైతం చేసేది లేక భారీగా ఉద్యోగుల కోతలను ప్రకటించాయి. కానీ ఇప్పుడు మంచి రోజులు తిరిగి వచ్చాయని చెప్పుకోవాలి.
అవును పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి వస్తున్నాయనే సంకేతాలను ప్రపంచ అగ్ర టెక్ కంపెనీలు ఇస్తున్నాయి. అమెరికాకు చెందిన టెక్ అగ్రకంపెనీలైన సేల్స్ ఫోర్స్, మెటాలు గతంలో తొలగించిన ఉద్యోగులను తిరిగి నియమించుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయి. గతంలో మెటా 10,000 మందిని, సేల్స్ ఫోర్స్ 7,000 మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది తొలినాళ్లలో మైక్రోసాఫ్ట్, గూగుల్ సైతం భారీ తొలగింపులను చేపట్టాయి.

అవసరానికి మించిన సంఖ్యలో ఉద్యోగుల నియామకాలు జరిగాయని పేర్కొంటూ టెక్ దిగ్గజాలు ఖర్చుల మదింపులో భాగంగా లేఆఫ్స్ ప్రకటించాయి. తమ వ్యాపారాలను కాపాడుకునేందుకు తప్పని పరిస్థితిలో కంపెనీలు ఈ చర్యలకు దిగాయి. కానీ ఇప్పుడు కొన్ని దిగ్గజ కంపెనీలు తిరిగి తొలగించిన వారిని రీహైర్ చేసుకోవాలని చూస్తున్నాయి. ఇది ఖచ్చితంగా శుభవార్తని చెప్పుకోవాలి. అయితే గతంలో తొలగింపులను సక్రమంగా చేపట్టిన కంపెనీలు వెళ్లిపోయిన ఉద్యోగులను తిరిగి తెచ్చుకోవటం సులభంగా జరుగుతుందని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఫ్రొఫెసర్ వెల్లడించారు.
కంపెనీని వృద్ధి చేయడం, గొప్ప మార్జిన్‌లను సాధించడం కొనసాగించడం తమ ముందున్న పనిగా సేల్స్‌ఫోర్స్ CEO మార్క్ బెనియోఫ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. రానున్న కాలంలో ఇదే ధోరణిని ఇతర టెక్ కంపెనీలు సైతం ఫాలో అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ వార్తలు టెక్ ఉద్యోగులకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications