IT News: భారత ఆర్థిక వృద్ధిలో అగ్రభాగాన్ని కలిగి ఉన్న సేవల రంగం ప్రస్తుతం అతలాకుతలం అవుతోంది. ప్రపంచ రాజకీయ పరిణామాలతో పాటు ఆర్థిక అనిశ్చితులు తోడుకావటమే దీనికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
ఈ క్రమంలో దాదాపు దేశంలోని అన్ని పెద్ద టెక్ కంపెనీలు సెప్టెంబర్ మాసంలో నిరాశాజనకమైన ఆర్థిక ఫలితాలను వెలువరించాయి. వాటిని నిశితంగా పరిశీలిస్తే టెక్ కంపెనీలు వ్యాపారం, హెడ్‌కౌంట్, ఆదాయంలో అధిక అస్థిరతను ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. 245 బిలియన్ డాలర్లు విలువైన భారత టెక్ సేవల పరిశ్రమలో కొన్ని ప్రముఖ కంపెనీలు దాని చరిత్రలో అత్యంత నెమ్మదిగా వృద్ధి పథాన్ని నమోదు చేస్తాయని అంచనా వేయబడింది.

దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీగా ఉన్న ఇన్ఫోసిస్ 2024 ఆర్థిక సంవత్సరంలో 1-2.5 శాతం మాత్రమే వృద్ధిని నమోదు చేస్తుందని BNP Paribas ముందుగానే అంచనా వేసింది. ఇది కంపెనీ చరిత్రలోనే బలహీనమైన వృద్ధిగా చెప్పుకోవచ్చు. అలాగే నాలుగవ పెద్ద ఐటీ కంపెనీ విప్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి కొలమానాలు 1999 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటుతో సమానంగా ఉన్నాయి. అలాగే టీసీఎస్, హెచ్సీఎల్ టెక్ కరోనా తర్వాత నిదానమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయి.
ప్రస్తుత వ్యాపార అనిశ్చితుల్లో అనేక విదేశీ టెక్ కస్టమర్లు తన కాంట్రాక్టులను, సర్వీస్ ప్లాన్లను హోల్డ్ లో ఉంచారు. ఇవి ఖర్చులను తగ్గించుకోవటంలో భాగంగా తీసుకోబడిన నిర్ణయాలు. ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న మందగమనం ఈ పరిస్థితులకు కారణంగా నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆదాయంలో 90-95 శాతం విదేశీ మార్కెట్ల నుంచి పొందుతున్నందున భారత సేవల రంగంలోని కంపెనీలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.

ఈ పరిస్థితిలో కొన్ని కంపెనీలు 2024లో తమ చెత్త వృద్ధి కొలమానాలను నమోదు చేయవచ్చని ఎవరెస్ట్ గ్రూప్ సీఈవో బెండర్-శామ్యూల్ అభిప్రాయపడ్డారు. 2024 మెుదటి ఆరు నెలలు గడ్డు కాలంగా పేర్కొన్నారు. ఏడాది డిసెంబర్ త్రైమాసికంలో అమ్మకాలు, లాభాల క్షీణత, రిక్రూట్మెంట్స్ లలో టెక్ కంపెనీలు కోలుకుంటాయని ప్రస్తుత అంచనాలు చెబుతున్నాయి. అయితే రోజురోజుకూ దిగజారుతున్న హమాస్-ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితులు వ్యాపారాలపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. రానున్న రెండుమూడు త్రైమాసికాలు కూడా నెమ్మదిగానే కొనసాగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications