Wipro News: టెక్ టాప్ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతున్న విప్రో కొన్ని సంచల నిర్ణయాలు తీసుకుంటోంది. అంతర్జాతీయ వ్యాపార మందగమనంలో కీలక వ్యాపారంపై ఫోకస్ పెట్టే క్రమంలో ముందుకు సాగుతోంది.
వివరాల్లోకి వెళితే టెక్ దిగ్గజం విప్రో తన రెండు ఆస్తులను విక్రయించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో బెంగళూరు, హైదరాబాదులో కంపెనీ కలిగి ఉన్న నాన్ కోర్ రియల్ ఎస్టేట్ ఆస్తులను విక్రయించి సొమ్ము చేసుకోవాలని చూస్తోంది. వీటి ద్వారా వ్యాపారాన్ని మరింతగా స్ట్రీమి లైన్ చేయాలనుకుంటోంది. కంపెనీ విక్రయించాలనుకుంటున్న ప్రాపర్టీల్లో హైదరాబాద్ గచ్చిబౌలిలోని క్యాపస్, బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటిలోని క్యాంపస్ లు ఉన్నట్లు వెల్లడైంది.

నాన్-కోర్ ఆస్తులుగా గుర్తించిన బెంగళూరు, హైదరాబాద్ ఆస్తులను విడిచిపెట్టడానికి విప్రో సిద్ధంగా ఉందని విషయం తెలిసిన వ్యక్తులు వెల్లడించారు. గచ్చిబౌలిలో కంపెనీకి దాదాపు 14 ఎకరాల భూమి ఉంది. ఇక బెంగళూరులో 25 ఎకరాల భూమిని కంపెనీ పూర్తిగా లేదా పాక్షికంగా విక్రయిస్తుండో వేచి చూడాలి. మారుతున్న వర్క్ కల్చర్‌కి అనుగుణంగా హైబ్రిడ్ వర్క్ మోడల్‌తో వివిధ నగరాల్లో కార్యకలాపాలను ఏకీకృతం చేయడమే లక్ష్యంగా తాజా చర్యలు వచ్చినట్లు వెల్లడైంది. అయితే కంపెనీ మాత్రం ఈ వార్తలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
విప్రోకు హైదరాబాదులో మెుత్తంగా మూడు ప్రాపర్టీలు ఉన్నాయి. వీటిలో రెండు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉండగా.. ఒకటి మనికొండలో ఉంది. వీటిని తెలంగాణ ప్రభుత్వం కంపెనీకి దాదాపు 20 ఏళ్ల క్రితం కేటాయించింది. సెప్టెంబరు త్రైమాసికంలో విప్రో మెుత్తంగా 2,44,707 మంది ఉద్యోగులకు కలిగి ఉంది. అలాగే ఉద్యోగుల టర్నోవర్ 15.5 శాతంగా ఉన్నట్లు త్రైమాసిక ఫలితాల్లో వెల్లడించింది. ప్రస్తుతం ప్రతికూల ఆర్థిక, వ్యాపార వాతావరణం కారణంగా కంపెనీ కొత్త నియామకాలను తాత్కాలికంగా చేపట్టడం నిలిపివేసింది.


Click it and Unblock the Notifications