Wipro: దయనీయ స్థితిలో టెక్ దిగ్గజం.. మూడేళ్లుగా 'NO' బిగ్ డీల్స్..!!
Wipro News: దేశంలో 4వ అతిపెద్ద IT సేవల సంస్థ విప్రో తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. రిషద్ ప్రేమ్‌జీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఐదేళ్లలో కంపెనీ అనేక మార్పులకు గురైంది.
భారతీయ ఐటీ కంపెనీల్లో ఎక్కడా లేనివిధంగా విదేశీయుడిని సీఈవోగా రిషద్ నియమించటం గమనార్హం. యూరోపియన్ మార్కెట్‌లో విప్రో వ్యాపారాన్ని విస్తరించే మెగా ప్లాన్ కోసం రిషద్ ప్రేమ్‌జీ థియరీ డెలాపోర్టేని నియమించారు. కానీ ప్రయోజనం పెద్దగా లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో కంపెనీ దేశంలో మూడవ టెక్ కంపెనీ స్థానాన్ని కోల్పోయి 4వ స్థానానికి దిగజారింది.

విప్రో గడచిన మూడేళ్ల కాలంలో మెగా డీల్స్ కుదుర్చుకోవటంలో విఫలమైంది. దీనిపై కంపెనీ ఇన్వెస్టర్లలో చర్చ రావటంతో ఈ విభాగాధిపతి స్టెఫానీ ట్రోట్‌మన్ తప్పుకున్నారు. వాస్తవానికి ఐటీ రంగంలో మందగమనం ఉన్నప్పటికీ ఇతర దిగ్గజ టెక్ కంపెనీలు గడచిన మూడేళ్లలో 1 బిలియన్ డాలర్లు విలువైన ప్రాజెక్టులను పొందటం కంపెనీ వెనుకపడటాన్ని సూచిస్తోంది. ఈ పరిస్థితులు పరోక్షంగా ఉద్యోగులపై కూడా కొంత మేర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు.
జనవరి 2021 నుంచి గత వారం వరకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఐదు మెగా కాంట్రాక్టులను గెలుచుకుంది. ఇన్ఫోసిస్ మూడు ప్రాజెక్ట్‌లను చేజిక్కించుకోగా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ $2 బిలియన్లకు పైగా విలువైన అతిపెద్ద కాంట్రాక్ట్ అందుకుని ముందుకు సాగుతోంది. వాస్తవానికి స్టెఫానీ ట్రోట్‌మాన్‌ని యాక్సెంచర్ నుంచి ఏరికోరి విప్రో మేనేజ్‌మెంట్ తీసుకొచ్చుకుంది. పైగా డిపార్ట్‌మెంటల్ ట్రేడ్‌ను ఆకర్షించడానికి కేటాయించబడిన స్టెఫానీ ట్రోట్‌మాన్ నేతృత్వంలోని పెద్ద కాంట్రాక్ట్స్ అట్రాక్షన్ విభాగంలో 12 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.


Click it and Unblock the Notifications