Wipro News: AIలో టెక్ దిగ్గజం భారీ పెట్టుబడి.. 3 ఏళ్లలో మ్యాటర్ మెుత్తం ఛేంజ్..
Wipro News: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో వేగంగా పెరుగుతోంది. భారత దిగ్గజ ఐటీ కంపెనీలు సైతం దీనిని అందిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు మెుదలు పెట్టాయి.
ఈ క్రమంలో దేశీయ టెక్ దిగ్గజం విప్రో తన AI-ఫస్ట్ ఎకోసిస్టమ్ Wipro ai360ని ప్రారంభించింది. క్లైంట్స్ దీనిని వినియోగించుకునేందుకు వీలుగా ఇంటిగ్రేట్ చేయాలని చూస్తున్నట్లు వెల్లడించింది. తన ఏఐ సామర్థ్యాలను మెరుగుపరుచుకునేందుకు రానున్న మూడేళ్లలో ఒక బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం తన 2.5 లక్షల ఉద్యోగులకు AI ఫండమెంటల్స్, బాధ్యతాయుత వినియోగంపై రానున్న 12 నెలల కాలంలో శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొంది.

కొత్త పెట్టుబడులతో ఏఐని విస్తరించటం, డేటా అండ్ అనలిటిక్స్ సొల్యూషన్స్, కొత్త R&D, ప్లాట్‌ఫారమ్‌లను అభివృద్ధి చేయడం, సైబర్ సెక్యూరిటీ, ఫుల్‌స్ట్రైడ్ క్లౌడ్ అండ్ కన్సల్టింగ్ సామర్థ్యాలను మెరుగుపరచడంపై దృష్టి సారించనున్నట్లు ఐటీ మేజర్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐ టెక్ పరిశ్రమను గణనీయంగా మార్చుతున్న తరుణంలో కంపెనీ తన పెట్టుబడులను క్రమంగా పెంచుతోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా వృద్ధి చెందుతున్న సాంకేతికత అని విప్రో లిమిటెడ్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ థియరీ డెలాపోర్టే అభిప్రాయపడ్డారు. జనరేటివ్ ఏఐ ఆవిర్భావంతో తాము అన్ని పరిశ్రమలకు ప్రాథమిక మార్పును ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో కొత్త సవాళ్లు తప్పవని అన్నారు. రానున్న కాలంలో కంపెనీ ఏఐ డీల్స్ పొందటానికి ప్రస్తుత పెట్టుబడులు, చర్యలు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.
టెక్ దిగ్గజం విప్రో వెంచర్స్ ద్వారా "అత్యాధునిక" స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టాలని చూస్తుంది. ఇది జనరేటివ్ AIపై దృష్టి సారించిన స్టార్టప్‌ల కోసం సీడ్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించబోతోంది. వారికి ఎంటర్‌ప్రైజ్-సిద్ధంగా మారడానికి శిక్షణ ఇస్తుంది. ఏఐపై కంపెనీ చేస్తున్న తాజా పెట్టుబడులు భవిష్యత్తు వ్యాపార వృద్ధికి దోహదపడనుంది.


Click it and Unblock the Notifications