TCS News: భారీ వ్యాపారానికి మెగా ప్లాన్.. 25 వేల మంది టెక్కీలను సిద్ధం చేస్తున్న టీసీఎస్..
TCS News: టెక్ రంగంలో వస్తున్న విపరీతమైన మార్పులు టెక్ కంపెనీలను భారీ మార్పుల వైపు నడిపిస్తోంది. బతకాలంటే మారాలంతే అన్నట్లుగా వాటి పరిస్థితి మారిపోయింది.
ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పెద్ద ప్లాన్‌తో ముందుకొచ్చింది. ఇందులో భాగంగా దాదాపు 25,000 మంది ఇంజనీర్లను సిద్ధం చేస్తోంది. తమ టెక్కీలకు జెనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌పై శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నట్లు కంపెనీ ప్రకటనలో తెలిపింది. మైక్రోసాఫ్ట్ క్లౌడ్‌లో తన కొత్త జెనరేటివ్ AI ఎంటర్‌ప్రైజ్ అడాప్షన్ ఆఫర్‌ను కూడా టీసీఎస్ ప్రారంభించనుంది. ఇది కస్టమర్లకు AI విషయంలో "జంప్‌స్టార్ట్" చేయడంలో సహాయపడనుంది.

టీసీఎస్.. అజురే మెషిన్ లెర్నింగ్ అండ్ అనెలిటిక్స్ లలో మైక్రోసాఫ్ట్ నుంచి స్పెషలైజేషన్‌లను పొందినట్లు వెల్లడించింది. దీనికి తోడు TCS క్లయింట్‌లకు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌ను వేగవంతం చేయడంలో, ప్రోగ్రామర్ ప్రొడక్టివిటీని పెంచడంలో సహాయం చేస్తుంది. కొత్త సాంకేతికతను సద్వినియోగం చేసుకోవడానికి TCS తన స్వంత ఉత్పత్తులను, ప్లాట్‌ఫారమ్‌లను మెరుగుపరుస్తోంది.
50,000 కంటే ఎక్కువ మైక్రోసాఫ్ట్-సర్టిఫైడ్ అసోసియేట్‌లతో.. TCS మైక్రోసాఫ్ట్ బిజినెస్ యూనిట్ వందలాది గ్లోబల్ కస్టమర్‌ల కోసం 1,000 కంటే ఎక్కువ విజయవంతమైన అజూర్ ఎంగేజ్‌మెంట్‌లను పూర్తి చేసింది. కంపెనీ వేస్తున్న అడుగులు రానున్న కాలంలో కంపెనీ వ్యాపార పనితీరును మెరుగుపరచగలని నిపుణులు భావిస్తున్నారు. కొత్త టెక్నాలజీలో ముందుగా అడుగుపెట్టడం ద్వారా అవకాశాలను లివరేజ్ చేసుకునే ప్రయత్నంలో కంపెనీ ఉంది. ఈ వార్తల నేపథ్యంలో టీసీఎస్ షేర్ నిన్న లాభపడింది.


Click it and Unblock the Notifications