TCS News: బాంబు పేల్చిన టీసీఎస్.. టెక్కీలు ఊహించని ప్రకటనే ఇది..!!

IT News: దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ టీసీఎస్. ప్రపంచ వ్యాప్తంగా కస్టమర్లను కలిగి ఉన్న టెక్ దిగ్గజం తాజాగా పెద్ద ప్రకటన చేసింది. కంపెనీ ప్రతినిధులు వెల్లడించిన వివరాలు చాలా మందిని ఊహించని షాక్ కి గురిచేస్తున్నాయి.

దేశంలోని యువ టెక్కీల కళ్లు ప్రస్తుతం ఐటీ రంగంలోని ఓపెనింగ్స్ పైనే ఉన్నాయి. టెక్ రంగంలోని వ్యాపార పరిస్థితుల కారణంగా చాలా కాలంగా నియామకాలు నిలిచిపోవటంతో దేశంలోని నిరుద్యోగిత యువత నిరాశలో ఉన్న తరుణంలో.. టాటాలకు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ప్రస్తుత గ్రాడ్యుయేట్లలో ఇండస్ట్రీ అవసరాలకు తగినట్లుగా భారీ నైపుణ్యాల కొరత కారణంగా ఉద్యోగులను ఎంపిక చేసుకోవటంలో కష్టపడుతోందని తెలుస్తోంది.

Tech Jaint TCS revealed due to technical skill gap company had 80000 open positions to fill

వాస్తవానికి టీసీఎస్ ప్రస్తుతం దాదాపు 80,000 ఖాళీలను కలిగి ఉంది. అయితే వీటిని భర్తీ చేయటం కంపెనీకి పెద్ద సవాలుగా మారిందని కంపెనీ రిసోర్స్ మేనేజ్‌మెంట్ గ్రూప్(RMG) గ్లోబల్ ఆపరేషన్స్ హెడ్ అమర్ షెటీ పేర్కొన్నారు. ప్రస్తుత ఉద్యోగుల నైపుణ్యాలు, అవసరమైన పాత్రల మధ్య అసమతుల్యత ఉందని, ఈ ఖాళీలను పూరించడానికి కంపెనీ కాంట్రాక్టర్లపై ఆధారపడవలసి వచ్చిందని షెటీ పేర్కొన్నారు. ఉద్యోగులకు ఉంటున్న నైపుణ్యాలు కంపెనీలోని ప్రాజెక్టుల అవసరాలకు సరిపోలడం లేదని వెల్లడైంది.

TCSతో సహా భారతీయ అనేక ఐటీ మేజర్‌లు ఫ్రెషర్‌లను ఆన్‌బోర్డింగ్ చేయడంలో జాప్యం చేస్తున్నాయి. చాలా మందికి ఇప్పటి వరకు చేరాల్సిన తేదీలను నిర్ధారించలేదు. గత రెండు సంవత్సరాలుగా 10,000 మంది ఫ్రెషర్లు ఈ ఆలస్యం కారణంగా ప్రభావితమయ్యారని నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్(NITES) డేటా వెల్లడించింది. అయితే టీసీఎస్ ప్రతినిధి నుంచి వచ్చిన ప్రకటనపై చాలా మంది నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

స్కిల్ గ్యాప్ లేదా జీతం అంతరాయా? చాలా మంది GCCలు భారతీయ MNCల కంటే మెరుగైన వేతనంతో రిక్రూట్ అవుతున్నట్లు కనిపిస్తోందని ట్విట్టర్లో ఒక వ్యక్తి స్పందించారు. నైపుణ్యం లేని వ్యక్తులు వారి నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేయడానికి ఇష్టపడకపోవడమే గ్రాడ్యుయేట్ యువకుల్లో నిరుద్యోగానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉందని మరో వ్యక్తి అభిప్రయాపడ్డారు. మరో వ్యక్తి కామెంట్ చేస్తూ టీసీఎస్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అంగీకరించదని తన సోదరుడు ఆరోగ్య సమస్యల కారణంగా ఆఫీసుకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉద్యోగాన్ని వదుకోవాల్సిన పరిస్థితి ఎర్పడిందని మరో వ్యక్తి ట్విట్టర్లో పేర్కొన్నాడు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+