TCS News: రూ.8,300 కోట్ల డీల్ కొచ్చేసిన టెక్ దిగ్గజం టీసీఎస్.. ఎవరితో అంటే..
TCS News: భారత ఐటీ సేవల రంగంలో అతిపెద్ద ఆటగాడిగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఐటీ కంపెనీలు కొత్త ప్రాజెక్టులు, డీల్స్ కోసం వేటాడుతున్న సమయంలో భారీ డీల్ టీసీఎస్ తలుపు తట్టింది.
దేశంలోని అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ TCS సోమవారం JLR డిజిటల్ యూనిట్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. జాక్వార్ ల్యాండ్ రోవర్ టాటా మోటార్స్ అనుబంధ సంస్థ. అయితే ఆటోమేకర్‌కు వ్యూహాత్మక సాంకేతిక నిర్మాణాన్ని రూపొందించేందుకు సహాయ పడటంలో తాజా డీల్ దోహదపడుతుందని కంపెనీ వెల్లడించింది. దీనికి ముందు దశాబ్ధకాలంగా టీసీఎస్ జేఎల్ఆర్ మధ్య దీర్ఘకాలిక రిలేషన్ ఉంది.

లగ్జరీ కార్ల తయారీ సంస్థను ఆప్టిమైజ్ చేయడంతో పాటు దాని వృద్ధి ఎజెండాను కొనసాగించడంలో ప్రస్తుత డీల్ సహాయపడనుంది. రానున్న ఐదేళ్ల కోసం రూ.8,300 కోట్ల కొత్త భాగస్వామ్య డీల్ జరిగినట్లు టీసీఎస్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. కొత్త భాగస్వామ్యంలో భాగంగా TCS అప్లికేషన్ డెవలప్‌మెంట్ అండ్ మెయింటెనెన్స్, ఎంటర్‌ప్రైజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్, క్లౌడ్ మైగ్రేషన్, సైబర్ సెక్యూరిటీ, డేటా సర్వీసెస్‌లో విస్తృత శ్రేణి సేవలను అందించనుంది.
ప్రధాన IT కార్యకలాపాలను మార్చడానికి కొత్త సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా సరఫరాదారులతో సినర్జీలు, ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచనుంది. తాజా భాగస్వామ్యం రాబోయే ఐదేళ్లలో JLR కోసం గణనీయమైన పొదుపులను అందిస్తూ.. భవిష్యత్తులో తిరిగి పెట్టుబడి పెట్టడానికి అవసరమైన ఉచిత నగదు ప్రవాహాన్ని అన్‌లాక్ చేస్తుందని JLR వెల్లడించింది.


Click it and Unblock the Notifications