TCS News: ఐటీ సేవల రంగంలో ఉన్న కంపెనీలకు ఉన్న తలనొప్పులు చాలవన్నట్లు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ఏకంగా ప్రభుత్వాల నుంచే నోటీసులు రావటంతో ఒత్తిళ్లు పెరుగుతున్నాయి.
లాటరల్ రిక్రూట్ల ఆన్‌బోర్డింగ్ ఆలస్యంపై పూణేకు చెందిన ఐటీ యూనియన్ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై మహారాష్ట్ర కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ సమాచార సాంకేతిక సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS)కి నోటీసు జారీ చేసింది. దీనిపై ప్రభుత్వానికి తమ వాదనను వెల్లడించేందుకు నవంబర్ 2, 2023న ఉదయం మేనేజ్‌మెంట్ సంయుక్త సమావేశం ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం జారీ చేసిన లేఖ వెల్లడించింది.

జూలైలో నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్(NITES) భారత ప్రభుత్వ కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖకు TCS ద్వారా 200 మందికి పైగా లాటరల్ రిక్రూట్ల ఆన్‌బోర్డింగ్ ఆలస్యాన్ని హైలైట్ చేస్తూ ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఇది మహారాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ అయింది. టెక్ దిగ్గజం ఆన్ బోర్డింగ్ ఆలస్యం కారణంగా ప్రభావితమైన అభ్యర్థుల సంఖ్య ప్రస్తుతం 2,000కు చేరుకుందని NITES ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలూజా ఆరోపించారు. ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదాల తర్వాత జూలై 10న వీరిలో చాలా మందికి ఆన్‌బోర్డింగ్ తేదీలను అక్టోబర్‌కు వాయిదా వేస్తున్నట్లు కంపెనీ నుంచి ఈ-మెయిల్స్ వచ్చాయి.
దాదాపు 1.8 సంవత్సరాల నుంచి 15 ఏళ్ల వరకు వివిధ స్థాయిల్లో అనుభవం కలిగిన చాలా మంది ఉద్యోగులు కంపెనీ ఆన్ బోర్డింగ్ కోసం వేచిచూస్తున్నారని ఫిర్యాదులో వెల్లడించారు. కంపెనీ చేస్తున్న ఆలస్యం కారణంగా వీరందరూ ఉద్యోగాలు లేకుండా ఆదాయాన్ని కోల్పోయారని అందులో తెలిపారు. బాధిత ఉద్యోగులకు వారి ఆన్‌బోర్డింగ్ ఆలస్యం అయిన నెలలకు గాను పూర్తి జీతాలను చెల్లించడానికి TCSకి నిర్దిష్ట ఆదేశాలు జారీ చేయాలని NITES ప్రభుత్వాన్ని కోరింది. ఇదే క్రమంలో బాధిత ఉద్యోగులకు TCS ఎంప్లాయీ అసిస్టెన్స్ ప్రోగ్రామ్‌కు యాక్సెస్ అందించాలని కూడా కోరింది.


Click it and Unblock the Notifications