ఉద్యోగులకు పిచ్చెక్కిస్తున్న మార్క్ జుకర్‌బర్గ్.. మళ్లీ ఉద్యోగాల కోతలు అందుకేనట..?
Meta Layoffs: అమెరికాలోని చాలా టెక్ ఆధారిత కంపెనీలు తమ వ్యాపారాలను కాపాడుకునేందుకు ఉద్యోగుల కోతలను ప్రకటిస్తున్నాయి. ఖర్చుల మదింపుతో వ్యాపార పునర్నిర్మాణం చేపట్టి సంక్షోభ సమయంలో నిలదొక్కుకోవాలని యాజమాన్యాలు చూస్తున్నాయి.
ఈ క్రమంలో సోషల్ మీడియా దిగ్గజం మెటా మరో రౌండ్ లేఆఫ్స్ వైపుగా అడుగులు వేస్తోంది. కంపెనీకి చెందిన ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ లలో బుధవారం నుంచి తొలగింపులు ప్రారంభించటానికి కంపెనీ సిద్ధంగా ఉందని తెలుస్తోంది. బృందాల పునర్నిర్మాణంలో భాగంగా సమర్థత లక్ష్యం దిశగా పనిచేసేందుకు మార్క్ జుకర్‌బర్గ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కంపెనీ ఉద్యోగులకు పంపిన మెమో ప్రకారం తొలగింపులు ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, రియాలిటీ ల్యాబ్ విభాగాల్లో ఉండనున్నాయని తెలుస్తోంది. దీనికి ముందు మార్చిలో జుకర్‌బర్గ్ ప్రకటించిన విధంగా ఏప్రిల్ చివర్లో 10,000 మంది ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభమౌతున్నట్లు తెలుస్తోంది. మేలో మరో రౌండ్ కోతలు అమలులోకి రానున్నాయి.
మెటా ఇప్పటికే నవంబరులో 13 శాతం ఉద్యోగులను అంటే దాదాపు 11,000 మంది ఉద్యోగులను తగ్గించింది. సాంకేతిక నిపుణులు- ఇంజనీర్ల నిష్పత్తిని వ్యాపార- పరిపాలనా సిబ్బందికి రీబ్యాలెన్స్ చేయడం లక్ష్యంగా పెట్టుకోవటం భారీ తొలగింపులకు కారణంగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications