Infosys News: ప్రస్తుతం వ్యాపారంలో అస్థిరతలు కొనసాగుతున్నప్పటికీ దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన భవిష్యత్తుకు బాటలు కొనసాగిస్తోంది. మారుతున్న వ్యాపార వాతారవణంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధమౌతోంది.
తాజాగా ఇన్ఫోసిస్ గూగుల్ క్లౌడ్‌తో తన అనుబంధాన్ని విస్తరిస్తోంది. పరిశ్రమకు అవసరమైన ఏఐ పరిష్కారాలను, ప్లాట్‌ఫారమ్‌లను అభివృద్ధి చేయడానికి ఇన్ఫోసిస్ కొత్త గ్లోబల్ జనరేటివ్ AI ల్యాబ్‌లను సృష్టిస్తోంది. దీనికోసం 20,000 మంది ఉద్యోగులకు ఇన్ఫోసిస్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. గూగుల్ వర్క్ స్పేస్ ద్వారా Vertex AI, Duet AIలపై వారికి శిక్షణ అందిస్తోంది.

తాజా శిక్షణ కార్యక్రమం ద్వారా అన్ని రకాల జనరేటివ్ ఏఐ ప్రాజెక్టుల డెవలప్మెంట్, ఇంప్లిమెంటేషన్, మేనేజ్ చేసే నైపుణ్యాలు కలిగిన టెక్కీలను ఇన్ఫోసిస్ దీని ద్వారా సిద్ధం చేసుకుంటోంది. కంపెనీ ప్రస్తుతం కలిగి ఉన్న డేటా ఆధారంగా గూగుల్ క్లౌడ్, ఇన్ఫోసిస్ మధ్య కూటమి కొనసాగుతోంది. వీటి ద్వారా యాంటి మనీలాండరింగ్, మార్కెటింగ్, సప్లై చైన్ వంటి రంగాల్లో సేవలను మెరుగుపరిచేందుకు ఏఐ సూట్స్ తీసుకురావాలని చూస్తోంది.
ఇన్ఫోసిస్ చాలా కాలంగా AI స్పేస్‌లో పెట్టుబడులు పెడుతోందని సీఈవో సలీల్ పరేఖ్ పేర్కొన్నారు. ట్రాన్స్ఫర్మేటివ్ బిజినెస్ సొల్యూషన్స్ అందించటంలో ఏఐ తోడ్పడుతుందని అన్నారు. ఉత్పాదకతను వేగవంతం చేయడానికి మా అనేక ఆఫర్‌లలో దీనిని ఇంట్రిగ్రేట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ టోపాజ్, ఇన్ఫోసిస్ కోబాల్ట్ బలం, నైపుణ్యాన్ని ఉపయోగించుకుని.. ఎంటర్‌ప్రైజెస్ కోసం వ్యాపార పరివర్తనను ప్రారంభించడంలో జెన్ AI ప్లాట్‌ఫారమ్‌ల సూట్‌ను అభివృద్ధి చేయడానికి గూగుల్ క్లౌడ్‌తో కలిసి పని చేస్తుందని ఇన్ఫోసిస్ ఒక ప్రకటనలో తెలిపింది.


Click it and Unblock the Notifications