Google Warning: డిజిటల్ చెల్లింపులు విస్తృతంగా దేశంలో విస్తరిస్తున్నందున దీనికి సంబంధించిన మోసాలు సైతం అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ప్రధానంగా యూపీఐ చెల్లింపులు ప్రజాధరణను పొందటం తెలిసిందే.
ఈ క్రమంలో గూగుల్ పే దేశంలోని టాప్-5 డిజిటల్ చెల్లింపు యాప్స్‌లో ఒకటిగా కొనసాగుతోంది. అలాగే ప్రపంచంలో గూగుల్ చెల్లింపుల వ్యవస్థకు భారత్ అతిపెద్ద వ్యాపారాన్ని కలిగి ఉంది. ఈ క్రమంలో యూజర్ల భద్రత కోసం గూగుల్ ఉత్తమమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మోసాలను నివారించే సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించింది. దీనికోసం పరిశ్రమలోని ఇతర కంపెనీలతో కలిసి చురుకుగా పనిచేస్తున్నట్లు పేర్కొంది.

ఈ క్రమంలో వినియోగదారులకు కొన్ని హెచ్చరించింది. గూగుల్ పే యాప్ వినియోగించటానికి అన్ని స్క్రీన్ షేరింగ్ యాప్‌లను మూసివేయాలని తెలిపింది. లావాదేవీ చేసినప్పుడు స్క్రీన్ షేరింగ్ యాప్‌లను ఎప్పుడూ ఉపయోగించవద్దని స్పష్టం చేసింది. Screen Share, AnyDesk, TeamViewer వంటి స్కీన్ షేరింగ్ యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. వాస్తవానికి వీటిని ఏదైనా సమస్యను పరిష్కరించేందుకు రిమోట్ యాక్సిస్ ద్వారా ఉపయోగిస్తుంటారు. వీటి ద్వారా ఫోన్, టాబ్లెట్ లేదా కంప్యూటర్లలో దుర్వినియోగం జరగకుండా వినియోగదారులు చూసుకోవాలి.
గూగుల్ పే వాడేటప్పుడు వినియోగదారులు స్కీన్ షేరింగ్ యాప్స్ ఎందుకు వాడకూడదో గూగుల్ ఇలా చెప్పింది.
- స్కీన్ షేరింగ్ ద్వారా సైబర్ నేరగాళ్లు మీ ఫోన్ నుంచి డిజిటల్ చెల్లింపులకు మీ తరఫున యాక్సిస్ ఇవ్వటాన్ని నిరోధించేందుకు
- మీ ఫోన్ లేదా కంప్యూటర్లలో ఉంచిన ఏటీఎమ్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాలు మోసగాళ్లు తెలుసుకునేందుకు వీలు కల్పించకుండా నివారించేందుకు
- దుండగులు మీ ప్రమేయం లేకుండా ట్రాన్సాక్షన్లు చేసినట్లయితే ఆ సమయంలో వచ్చే ఓటీపీలను మీ ఫోన్ లేదా టాబ్లెట్ నుంచి తెలుసుకుని డబ్బును తస్కరించటాన్ని నివారించేందుకు.
ఈ ప్రమాదాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు స్కీన్ షేరింగ్ యాప్స్ ఫోన్లలో డిలీట్ చేయాలి. అనవరసమైన యాప్స్ ఫోన్లలో లేకుండా చూసుకోవాలి.


Click it and Unblock the Notifications