Cognizant News: కాగ్నిజెంట్ నిర్ణయంతో విప్రో షాక్.. జతిన్ దలాల్ లెవెల్ వేరే..
Cognizant News: ప్రస్తుతం విప్రోలో జరుగుతున్న పరిణామాలు భారత ఐటీ రంగంలో చర్చనీయాంశంగా మారింది. అగ్ర నాయక్వ స్థానాలు వరుసగా ఖాళీ కావటం.. వారికే ఇతర కంపెనీలు గ్యాలం వేయటంపై డిస్కషన్స్ నడుస్తున్నాయి.
రెండు దశాబ్ధాలకు పైగా విప్రోను ముందుకు తీసుకెళ్లటంలో అనేక స్థాయిల్లో ఇటీవల రాజీనామా చేసిన సీనియర్ అధికారి జతిన్ దలాల్ పనిచేశారు. అయితే సడన్ గా తాను కంపెనీని వీడాలనుకుంటున్నట్లు ఆయన చేసిన ప్రకటన బాంబు పేల్చింది. ప్రత్యర్థి టెక్ కంపెనీ కాగ్నిజెంట్ లో చేరిక అటు విప్రో యాజమాన్యంతో పాటు తోటి ఉద్యోగులను సైతం షాక్ కి గురిచేసింది. అలాగే కాగ్నిజెంట్ జతిన్ దలాల్ కోసం USలో నాన్-వర్కింగ్ వీసాను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ తన కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా జతిన్ దలాల్‌ను ప్రకటించటం బ్రేకింగ్ న్యూస్ అయ్యింది. ఇక్కడ అన్నింటి కంటే ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఆయనకు చెల్లిస్తున్న జీతం గురించి. అవును దలాల్ కొత్త కంపెనీలో తన పాత వేతనం కంటే దాదాపు 5 రెట్లు అధిక వేతనాన్ని పొందుతున్నట్లు బయటకు రావటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
కాగ్నిజెంట్‌లో చేరిన జతిన్ దలాల్ వార్షిక మూల వేతనంగా 7,50,000 డాలర్లను పొందుతారు. ఇది విప్రో గతంలో అందించిన జీతం కంటే రెండింతలు ఎక్కువ. అలాగే దలాల్ వార్షిక ప్రాతిపదికన దాదాపు 52,00,000 డాలర్లు సంపాదించడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఆయన విప్రోలో సంపాదించిన దాని కంటే 5 రెట్లు అధికం. 2023 ఆర్థిక సంవత్సరంలో విప్రో పేలవమైన పనితీరు కారణంగా జతిన్ దలాల్ జీతం దాదాపు 32 శాతం తగ్గించబడింది. దీనికి తోడు పనితీరు ఆధారంగా వచ్చే స్టాక్ యూనిట్లు అదనంగా ఉంటాయి.


Click it and Unblock the Notifications