Apple: చైనాతో ఆపిల్ తెగదెంపులు.. వాటి తయారీ కూడా ఇండియాకి తరలింపు.. సూపర్..
తయారీ రంగంలో చైనాది చాలా పెద్ద సామ్రాజ్యం. అయితే ఇప్పుడు ఆ కోట క్రమంగా బీటలు వారుతోంది. వ్యాపార ఆదాయాన్ని చూసుకుని ఇప్పటి వరకు పెత్తనం చెలాయించిన చైనాను మెల్లగా దిగ్గజ కంపెనీలు వీడుతున్నాయి. అక్కడి నుంచి తమ వ్యాపారాలను ఇతర దేశాలకు తరలిస్తున్నాయి.

లాభపడుతున్న భారత్..
టెక్ దిగ్గజం ఆపిల్ ఎయిర్‌పాడ్‌లు, బీట్స్ హెడ్‌ఫోన్ ఉత్పత్తిని భారతదేశానికి తరలించాలని దాని సరఫరాదారులను కోరింది. ఆపిల్ ఐఫోన్ అసెంబ్లర్ ఫాక్స్‌కాన్ భవిష్యత్తులో ఎయిర్‌పాడ్‌లతో పాటు బీట్స్ హెడ్‌ఫోన్‌లను కూడా మనదేశంలోనే ఉత్పత్తి చేయాలని యోచిస్తోంది.

దేశంలో ఏర్పాటు..
Appleకి చైనీస్ సరఫరాదారైన Luxshare Precision Industry ఎయిర్‌పాడ్‌లను భారత్ లో తయారు చేయడంలో కూడా సహాయం చేస్తోంది. చైనాలో కొనసాగుతున్న US-చైనా శత్రుత్వాలు, కొవిడ్-19 ఆంక్షల నేపథ్యంలో Apple తన సరఫరా గొలుసును విస్తరించాలని నిర్ణయించింది. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించాలని చూస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఐఫోన్ 13 తయారీ..
ఆపిల్ కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో మన దేశంలోనే ఐఫోన్ 13 తయారీని ప్రారంభించింది. దేశంలో ఐప్యాడ్‌లను అసెంబుల్ చేయాలని కూడా యోచిస్తోంది. కంపెనీ తన తయారీని భారత్ తో సహా మరికొన్ని దేశాలకు చైనా నుంచి తరలిస్తోంది.

లేటెస్ట్ ఫోన్స్..
ఆపిల్ తాజాగా ఐఫోన్ 14ని కూడా భారత్‌లో తయారు చేయనున్నట్లు ప్రకటించింది. iPhone ఎగుమతులు ఏప్రిల్ నుంచి ఐదు నెలల్లో 1 బిలియన్ డాలర్లను అధిగమించాయి. భారత్ నుంచి ఈ ఎగుమతుల విలువ మార్చి 2023 నుంచి ఏడాది లోపు 2.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని అంచనాలు చెబుతున్నాయి. ఇది ఆర్ధికంగా భారత్ కు కలిసొచ్చే అంశంగా చెప్పుకోవాలి. పైగా దేశంలో ఉపాధి అవకాశాలు సైతం పెరుగుతాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


Click it and Unblock the Notifications