IT News: బోల్తా పడ్డ టెక్ మేజర్ యాక్సెంచర్..! భారత కంపెనీల పరిస్థితి కూడా ఇంతేనా..?
Accenture News: ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాన్ని కలిగి గుర్తింపు ఉన్న కంపెనీ యాక్సెంచర్. తాజాగా ఇది తన రెండవ త్రైమాసిక ఆదాయ అంచనాలను విడుదల చేసింది.
ఈ క్రమంలో కంపెనీ ప్రతికూలతను ఎదుర్కొంటోంది. రెండవ త్రైమాసికానికి వాల్ స్ట్రీట్ నిపుణుల అంచనాలను అందుకోవటంలో వెనుకబడినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ముందుగానే అంచనా వేసినట్లుగా క్లైంట్లు ఖర్చులను తగ్గించుకోవటంతో పాటు స్థూల ఆర్థిక అనిశ్చితి దీనికి కారణంగా నిలుస్తున్నాయి.

వ్యాపారాలు సాధారణంగా తమ వార్షిక బడ్జెట్‌లను ఫిబ్రవరి తర్వాత మాత్రమే నిర్ణయిస్తాయి కాబట్టి IT సేవల వ్యయం సమీప కాలంలో మ్యూట్ చేయబడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా టెక్, మీడియా కంపెనీల్లో బడ్జెట్-సంబంధిత నిర్ణయాధికారం నెమ్మదిగా ఉంటుందని యాక్సెంచర్ సూచిస్తోంది. ఇండియాలో సైతం టెక్ దిగ్గజం టీసీఎస్ అక్టోబర్‌లో ఊహించిన దానికంటే బలహీనమైన త్రైమాసిక ఫలితాలను నివేదించింది.
ఇక మరో టాప్ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తన వార్షిక ఆదాయాల అంచనాలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారు కంపెనీలు ఇప్పటికీ విచక్షణతో కూడిన ప్రాజెక్ట్‌లపై ఖర్చు చేయడానికి వెనుకాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యాక్సెంచర్ తన రెండవ త్రైమాసిక ఆదాయాన్ని 15.40-16 బిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తోంది. అయితే విశ్లేషకులు మాత్రం దీనిని 16.29 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా వేశారు. అంటే తాజా మార్కెట్ అంచనాలను కంపెనీ అందుకోలేదని తెలుస్తోంది.నవంబర్ 30తో ముగిసిన మొదటి త్రైమాసికంలో దాని ఆదాయం 3% పెరిగి 16.2 బిలియన్ డాలర్లుగా నమోదైంది.


Click it and Unblock the Notifications