Accenture: గ్లోబల్ మార్కెట్లలో పెరుగుతున్న ఆందోళనలు ఐటీ కంపెనీల ఆదాయ అంచనాలను తలకిందులు చేస్తున్నాయి. వీటి కారణంగా కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవటం కంపెనీలకు ఇబ్బందిగా మారుతోంది.
ఈ క్రమంలో టెక్ దిగ్గజం యాక్సెంచర్ నాలుగో త్రైమాసిక ఆదాయం వాల్ స్ట్రీట్ అంచనాల కంటే తక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం అమెరికాలో ఐటీ కంపెనీలకు డిమాండ్ చాలా బలహీనంగా ఉంది. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ గత నెలలో విచక్షణతో కూడిన ఖర్చుల కారణంగా చిన్న ఒప్పందాలపై సంతకం చేయడంలో ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు తెలిపింది.

ఇక భారత ఐటీ సేవల ఔట్‌సోర్సింగ్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఏప్రిల్‌లో అమెరికా మార్కెట్లలో రికవరీ ఆశించిన విధంగా కార్యరూపం దాల్చలేదని, వాస్తవానికి మరింత దిగజారిందని పేర్కొంది. యాక్సెంచర్ తన ఆదాయం ఈ ఏడాది ఆదాయ వృద్ధి 8-9 శాతం మధ్య ఉంటుందని అంచనా వేస్తోంది. అలాగే నాలుగో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 15.75 బిలియన్ డాలర్ల నుంచి 16.35 బిలియన్ డాలర్ల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తోంది. ఇది అక్కడి మార్కెట్ అంచనాల కంటే తక్కువని చెప్పుకోవాలి.

ఐటీ సేవల కంపెనీ TCS బ్రిటీష్ పెన్షన్ స్కీమ్ నెస్ట్‌తో భాగస్వామ్యాన్ని విస్తరించింది. యూకే పెన్షన్ సంస్థతో 10 ఏళ్ల కాలానికి 1.1 బిలియన్ డాలర్ల పలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుని సంతకం చేసింది. దీనికి ముందు కంపెనీ అమెరికాకు చెందిన ఇన్సూరెన్స్ కంపెనీతో 2 బిలియన్ డాలర్లకు పైగా విలువైన డీల్ ను అర్థాంతరంగా ముగించింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications