Infosys News: ఇన్ఫోసిస్ షాకింగ్ నిర్ణయం.. నారాయణమూర్తి ఫోకస్ పెంచటంతో..
IT News: దేశంలోని టాప్ టెక్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఇన్ఫోసిస్ సంచలన ప్రకటన చేసింది. సహవ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో కీలక కామెంట్స్ తర్వాత టెక్కీలకు తలనొప్పులు మెుదలయ్యాయి.
వివరాల్లోకి వెళితే ఇన్ఫోసిస్ తన ఉద్యోగులను వారంలో మూడు రోజులు తప్పక ఆఫీసులకు రావాల్సిందేనని తేల్చి చెప్పింది. ఉత్పాదకత, ఆర్థిక వృద్ధి కోసం ఉద్యోగులు వారానికి 70 గంటలు పని చేయాల్సిన అవసరాన్ని గురించి పలుమార్లు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి పదేపదే ఒత్తి చెబుతున్న వేళ కంపెనీ ఈ ప్రకటన చేయటం జరిగింది.

తాజా నివేదికల ప్రకారం సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులను వారానికి కనీసం 3 రోజులు కార్యాలయానికి వచ్చి పనిచేయాల్సిందిగా కోరినట్లు వెల్లడైంది. కరోనా మహమ్మారి రాకతో దాదాపు మూడేళ్లపాటు ఇంటి నుంచి పని చేసేందుకు ఇన్ఫోసిస్ అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. దీనికి ముందు విప్రో సైతం తన ఉద్యోగులకు ఇదే తరహా షరతును విధించింది. అయితే టెక్ దిగ్గజం టీసీఎస్ మాత్రం మరో అడుగు ముందుకేసి వారంలో 5 రోజుల పాటు పూర్తిగా ఆఫీసుల నుంచి పనిచేయాలని తేల్చి చెప్పేసింది. పైగా ఉద్యోగులను ట్రాన్ఫర్ చేయటం పెద్ద గందరగోళానికి సైతం కారణమైంది.
నేడు స్టాక్ మార్కెట్లలో ఇన్ఫోసిస్ స్టాక్ ఒత్తిడికి చిత్తై నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. నిన్న సాయంత్రం కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిలంజన్ రాయ్ రాజీనామాతో ఒక్కసారిగా ఇన్వెస్టర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. చాలా కంపెనీల్లో సీఎఫ్ఓలు ఇటీవల రాజీనామాలు చేయటం వాటి ఆర్థిక పనితీరుకు అద్దం పడుతోంది. గడ్డు కాలంలో యాజమాన్యాలు, స్టేక్ హోల్డర్లను సంతృప్తి పరిచే స్థాయిలో వ్యాపారాలు కొనసాగక పోవటం వారిపై కొంత అధిక ఒత్తిడికి కారణమౌతున్నాయి.


Click it and Unblock the Notifications