IT News: ఇటీవల దేశీయ ఐటీ కంపెనీలు తమ సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించిన కార్పొరేట్ ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది ఉద్యోగులు కంపెనీలు వేతన పెంపులతో పాటు వేరియబుల్ పే చెల్లింపు ప్రకటనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకపక్క ఇప్పుడిప్పుడు టెక్ కంపెనీలు ఒకపక్క కోలుకుంటుండగా మరోపక్క అమెరికాలో ట్రంప్ గెలవటం కంపెనీలకు ఖర్చులను పెంచే అంశంగా పరిగణించబడుతోంది. రానున్న కాలంలో ఈ ప్రభావం ఉంటుందని చాలా మంది చెబుతున్నారు.
చాలా మంది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉద్యోగులు జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో తమ వేరియబుల్ వేతనాన్ని తగ్గించినట్లు గమనించారు. అయితే కార్యాలయ నిబంధనల కింద వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాటించినప్పటికీ, వ్యాపారంలో డిమాండ్ అనిశ్చితి కొనసాగుతోందని సమాచారం. ఇదే క్రమంలో కొందరు టెక్కీలు వారి క్వార్టర్లీ వేరియబుల్ పే అవుట్‌లో 20-40 శాతం మాత్రమే పొందినట్లు వెల్లడైంది. మరికొందరికి ఏకంగా సున్నా శాతం వేరియబల్ పే కంపెనీ చెల్లించిందని తేలింది. గత త్రైమాసికంలో ఇచ్చిన 70 శాతం పే అవుట్‌తో పోలిస్తే ప్రస్తుతం దారుణ పరిస్థితులు ఉన్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. కరోనా సమయంలో సైతం కంపెనీ వేరియబుల్ పే విషయంలో ఇంత దారుణంగా వ్యవహరించలేదని వారు చెబుతున్నారు.

TCS కోసం వేరియబుల్ చెల్లింపు అంతర్గత వ్యాపార యూనిట్ వారీ పనితీరుపై కూడా ఆధారపడి ఉంటుంది. ఈ పరిణామం కొనసాగుతున్న సవాలుగా ఉన్న డిమాండ్, స్థూల ఆర్థిక అనిశ్చితిపై వెలుగునిస్తుంది. ఇది Q2 నాటికి టైర్-I ఆటీ సేవల కంపెనీలు నివేదించిన తక్కువ సింగిల్-డిజిట్ వృద్ధికి దారితీసింది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్ స్థిరమైన కరెన్సీ పరంగా ఏడాది ప్రాతిపదికన 5.5 శాతం ఆదాయ వృద్ధిని రూ.64,259 కోట్లకు నమోదు చేసింది. ఈ క్రమంలో కంపెనీ లాభం రూ.11,909 కోట్లుగా నిలిచింది.
తాజాగా వేరియబుల్ పే కోతల గురించి టీసీఎస్ అధికారిక ప్రతినిధి క్లారిటీ ఇచ్చారు. రెండవ త్రైమాసిక కాలానికి జూనియర్ గ్రేడ్ టెక్ ఉద్యోగులకు క్వార్టర్లీ వేరియబుల్ పే అలవెన్సును 100 శాతం చెల్లించినట్లు వెల్లడించారు. అయితే జూనియర్ గ్రేడ్ పై స్థాయి ఉద్యోగుల విషయంలో మాత్రం వారు పనిచేస్తున్న QVA వారి యూనిట్ వ్యాపార పనితీరుపై ఆధారపడి ఉంటుందని ఆయన వెల్లడించారు. దీనికి అనుగుణంగానే తాజా చర్యలు వచ్చాయని పేర్కొన్నారు.
వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రూల్స్ మార్పు..
ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో టీసీఎస్ తన ఉద్యోగులను తప్పనిసరిగా వారంలో అన్ని రోజులూ ఆఫీసు నుంచే పనిచేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన హాజరు విధానాన్ని అప్‌డేట్ చేసింది. టెక్కీలు వారి పూర్తి త్రైమాసిక వేరియబుల్ వేతనాన్ని పొందేందుకు కార్యాలయ హాజరు కనీసం 85 శాతంగా నిర్ణయించింది. కార్యాలయ హాజరు నుండి 75-85 శాతం మధ్య హాజరు ఉన్న ఉద్యోగులు వేరియబుల్ పేలో 75 శాతం పొందుతారు. అలాగే 60-75 శాతం హాజరు ఉన్నవారు వారి వేరియబుల్ పేలో 50 శాతం మాత్రమే పొందుతారని కంపెనీ ప్రకటించింది. అలాగే హాజరు 60 శాతం కంటే తక్కువగా నమోదైన వ్యక్తులు క్వార్టర్లీ వేరియబుల్ పేకు అర్హులు కాదు.


Click it and Unblock the Notifications