HCL Tech News: మార్కెట్ అంచనాలు మిస్సైన హెచ్‌సీఎల్ టెక్ లాభాలు.. డివిడెండ్ ప్రకటన..
Q4 Results: దేశంలోని టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నేడు తన నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ గత ఏడాదితో పోల్చితే స్వల్పగా అధిక లాభాలను నమోదు చేసింది.
మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో టెక్ జెయింట్ రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు ప్రకటించింది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా నమోదు చేసింది. ఇదే క్రమంలో ఏడాది ప్రాతిపదికన కంపెనీ ఆదాయం 7.1 శాతం పెరిగి రూ.28,499 కోట్లుగా నమోదైంది. ఇది మార్కెట్ అంచనాల కంటే తక్కువ కావటం గమనార్హం.

అక్టోబర్-డిసెంబర్ కాలంలో నమోదైన రూ.4,351 కోట్లతో పోలిస్తే త్రైమాసికానికి-పన్ను అనంతర లాభం 8 శాతం క్షీణతను చవిచూసింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం 5.3 శాతం పెరిగి రూ.28,499 కోట్లుగా ఉంది. టెక్ కంపెనీలు అంతర్జాతీయ సవాళ్లతో ఇబ్బందులు పడుతున్న సమయంలో కూడా అమెరికా రాబడుల వృద్ధి 5.4 శాతం పెరిగి పరిశ్రమకు నాయకత్వం వహిస్తోంది. హెచ్‌సీఎల్ FY24 పనితీరు పూర్తి ఏడాదికి 8.3% వృద్ధితో రూ.1,09,913 కోట్ల ఆదాయంతో వ్యాపార స్థితిస్థాపకతను నొక్కి చెబుతోంది. ఈ పరిశ్రమను EBITతో 8.4% వృద్ధితో రూ.20,027 కోట్లతో అగ్రగామిగా అందించినట్లు కంపెనీ పేర్కొంది.
2024-25 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ.2 ముఖవిలువ కలిగిన ప్రతి ఈక్విటీ షేరుపై రూ.18 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఏప్రిల్ 26న FY24కి సంబంధించిన నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ మే 7, 2024ని డివిడెండ్ చెల్లింపు కోసం రికార్డ్ డేట్‌గా సెట్ చేసింది. పేర్కొన్న మధ్యంతర డివిడెండ్ చెల్లింపు తేదీగా మే 15, 2024ని నిర్ణయించింది. కంపెనీ ఏఐ ఆదారిత ఉత్పత్తుల వైపు నడుస్తోందని తాము వీటిపై దృష్టి సారించామని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications