టెక్నాలజీ దిగ్గజం గూగుల్ క్లౌడ్ విభాగంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్యను తగ్గించిందని బ్లూమ్‌బెర్గ్ న్యూస్ బుధవారం నివేదించింది. డిజిటల్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న వాతావరణంలో గూగుల్ తీసుకున్న ఈ చర్య వివిధ ప్రశ్నలను లేవనెత్తింది. ఈ తొలగింపు ఇప్పుడు ఎందుకు జరిగింది..? దీని వెనుక కారణం ఏమిటి..? ఇప్పుడు చూద్దాం.
కస్టమర్ల అవసరాలు అండ్ కొత్త అవకాశాలను తీర్చడానికి గూగుల్ నిరంతరం మార్పులు చేస్తోందని గూగుల్ ప్రతినిధి బ్లూమ్‌బెర్గ్‌తో అన్నారు. మరోవైపు ఈ నెల ప్రారంభంలో గూగుల్ క్లౌడ్ వ్యాపారం ఆదాయం విశ్లేషకుల అంచనాల కంటే తక్కువగా ఉంది. అదే సమయంలో 2025లో కంపెనీ ఖర్చులు ఊహించిన దానికంటే ఎక్కువగా పెరిగాయి. ఈ తొలగింపులు కూడా దీని కారణంగానే జరిగి ఉండవచ్చని చెబుతున్నారు. గూగుల్ క్లౌడ్ విభాగం కంపెనీ వృద్ధికి ఎంతో దోహదపడే ముఖ్యమైన విభాగం. అందువల్ల, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కంపెనీ ఆర్థిక వ్యవస్థను సర్దుబాటు చేయడానికి గూగుల్ కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. ఫలితంగా, కొంతమంది ఉద్యోగులను ఇప్పుడు తొలగించారు. అయితే తొలగించిన ఉద్యోగుల మొత్తం సంఖ్య వెల్లడికాలేదు.

అయితే గూగుల్ ఉద్యోగులను తొలగించడం ఇదేం మొదటిసారి కాదు. గూగుల్ ఇంతకు ముందు చిన్న తరహా తొలగింపులు చేసింది. ఫలితంగా, ఇప్పుడు మరోసారి తొలగింపు జరిగింది. క్లౌడ్ డివిజన్ తొలగింపులకు ముందు గూగుల్ జనవరి 2024లో తన"Platforms and Devices" విభాగం నుండి స్వచ్ఛంద తొలగింపుల ప్రణాళికను ప్రకటించింది. ఈ ప్రకటన ప్రధానంగా ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోన్ అండ్ నెస్ట్ వంటి గూగుల్ చెందిన ప్రసిద్ధ ఉత్పత్తులలో పనిచేసే ఉద్యోగుల కోసం చేసింది. ఈ ప్లాన్ కింద ఉద్యోగులు తమంతట తాముగా కంపెనీని విడిచిపెట్టాలనుకుంటే వారికి పరిహార మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ స్వచ్ఛంద నిష్క్రమణ కార్యక్రమం ఉద్దేశ్యం కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించే ఉద్దేశ్యంతో తీసుకుంది.
గతంలో చూస్తే సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ 2022లో ఖర్చు తగ్గింపులను ప్రారంభించింది, ఈ తరుణంలోనే CEO సుందర్ పిచాయ్ కంపెనీని 20 శాతం మరింత సమర్థవంతంగా చేయాలనే లక్ష్యాన్ని ప్రకటించారు. ఈ పునర్నిర్మాణం భారీ తొలగింపులకు దారితీసింది, దింతో జనవరి 2023లో 12 వేల మంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. ఈ సంవత్సరం జనవరిలో యుఎస్ అండ్ కెనడా నుండి గూగుల్ ఉద్యోగులు తరచుగా జరిగే తొలగింపుల గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక ఇంటర్నల్ పిటిషన్‌పై సంతకం చేశారు. దాదాపు 1,250 మంది ఉద్యోగులు మెరుగైన విరమణ నిబంధనలను కూడా డిమాండ్ చేశారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications