గూగుల్ కీలక ప్రకటన.. కంపెనీకి వందలాది ఉద్యోగుల గుడ్ బై..
ఆల్ఫాబెట్‌కు చెందిన గూగుల్ దిగ్గజం గురువారం ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్, పిక్సెల్ ఫోన్స్ అండ్ క్రోమ్ బ్రౌజర్‌లోని విభాగంలో పనిచేస్తున్న వందలాది ఉద్యోగులను తొలగించింది. దీనికి సంబంధించి ఎన్డీటీవీ తాజాగా రిపోర్ట్ చేసింది. అయితే ఈ తొలగింపులు నిన్న గురువారం జరిగినట్లు తెలుస్తోంది. గత ఏడాది జనవరి 2023లో ఆల్ఫాబెట్ 12 వేల ఉద్యోగాలను అంటే ప్రపంచ వర్క్ ఫోర్స్'లో 6% ఉద్యోగాలను తగ్గించే ప్లాన్ ప్రకటించిన సంగతి మీకు తెల్సిందే.

"గత సంవత్సరం గూగుల్ ప్లాట్‌ఫామ్స్ అండ్ డైవైజెస్ టీంలను కలిపినప్పటి నుండి, మేము మరింత వేగంగా అలాగే మరింత ప్రభావంగా పనిచేయడంపై దృష్టి పెట్టాము అలాగే జనవరిలో మేము అందించిన వాలంటరీ ఎగ్జిట్ ప్రోగ్రాంకి అదనంగా కొన్ని ఉద్యోగాల కోతలు కూడా ఇందులో చేర్చాము" అని గూగుల్ ప్రతినిధి అన్నారు. అయితే దీని పై గూగుల్ అధికారికంగా స్పందించలేదు.
అంతేకాదు గత నెల ఫిబ్రవరిలో బ్లూమ్‌బెర్గ్ గూగుల్ క్లౌడ్ డివిజన్‌లో ఉద్యోగులను తగ్గించిందని నివేదించింది, ఈ ఉద్యోగాల కోతలు కొన్ని టీమ్స్ పై మాత్రమే ప్రభావం చూవుతుందని పేర్కొంది.CNBC నివేదిక ప్రకారం, ఈ విభాగంలో Android, Chrome, ChromeOS, Google Photos, Google One, Pixel, Fitbit అండ్ Nest లలో పనిచేస్తున్న 25 వేల కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు.
2024లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రిక్ ఓస్టర్లోహ్ ఆధ్వర్యంలో గూగుల్ ఆండ్రాయిడ్ అండ్ హార్డ్‌వేర్ టీంస్ విలీనం తర్వాత ఈ చర్య జరిగింది, దీని లక్ష్యం గూగుల్ ప్రొడక్ట్స్ లో AI ఫీచర్స్ ఇంటెగ్రేషన్స్ వేగవంతం చేయడం.31 డిసెంబర్ 2024 నాటికి గూగుల్ పేరెంట్ సంస్థ అయిన ఆల్ఫాబెట్ ఇంక్.లో ప్రపంచవ్యాప్తంగా 183,323 మంది ఉద్యోగులు ఉన్నారని నివేదించింది, అయితే అంతమందు సంవత్సరం కంటే 821 (0.45%)తో స్వల్ప పెరుగుదల చూపిస్తుంది.
2024 నాల్గవ త్రైమాసికంలో ఆల్ఫాబెట్ వాల్ స్ట్రీట్ ఆదాయ అంచనాలను కోల్పోయింది. దింతో కంపెనీ అంచనా వేసిన $96.56 బిలియన్లతో పోలిస్తే $96.47 బిలియన్ల ఆదాయాన్ని నివేదించింది. యూట్యూబ్ యాడ్ రెవిన్యూ మాత్రం అంచనాలను మించి $10.47 బిలియన్లకు చేరుకోగా, గూగుల్ క్లౌడ్ ఆదాయం $11.96 బిలియన్లకు తగ్గింది. మొత్తం ఆదాయం చూస్తే సంవత్సరానికి దాదాపు 12% పెరిగింది, కానీ అడ్వాటైజింగ్, సెర్చ్, యూట్యూబ్ ఇంకా ఇతర సేవలతో సహా కీలక విభాగాలలో వృద్ధి గత సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే మందగించింది, ఈ గణాంకాలు పెట్టుబడిదారులలో ఆందోళనలను రేకెత్తిస్తోంది.


Click it and Unblock the Notifications